Advertisement
Advertisement
Abn logo
Advertisement

వివాహిత ఆత్మహత్య

పూతలపట్టు, డిసెంబరు 7: ఓ వివాహిత రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పూతలపట్టు మండలంలోని పి.కొత్తకోట పంచాయతీ వసంతాపురం దళితవాడకు చెందిన బాబు భార్య లత(36) స్థానిక పీహెచ్‌సీలో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. ఈమెకు ముగ్గురు పిల్లలున్నారు. భర్త డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఏం జరిగిందో ఏమో సోమవారం రాత్రి గ్రామ సమీపాన ఉన్న రైలుపట్టాలపై  శవమై కనిపించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం మృతురాలి కుటుంబాన్ని స్థానిక వైసీపీ నాయకుడు అమరనాథ్‌రెడ్డి, ఎంపీపీ కుమారి పరామర్శించారు.

Advertisement
Advertisement