Advertisement
Advertisement
Abn logo
Advertisement

జీవితంపై విరక్తితో వివాహిత ఆత్మహత్య

కంభం, డిసెంబరు 7 : అనారోగ్య సమస్యలు పీడిస్తుండడంతో జీవితంపై విరక్తి చెంది ఓ వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం... కంభం పట్టణానికి చెందిన జూటూరి వెంకటలక్ష్మి(30) పదేళ్ల క్రితం మేనమామను పెళ్లి చేసుకుంది. వారికి బాబు ఉన్నా డు. ఇటీవల వెంకటలక్ష్మికి ఆరోగ్యం సరిగాలేదు. పలు వైద్యశాలల్లో చూపించుకున్నా రోగం నయం కాలేదు. దీంతో పురుగు మందు ఆత్మహత్య చేసుకున్నది. మంగళవారం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పరిశీలించిన ఎస్‌ఐ స్వగ్రామానికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Advertisement
Advertisement