Abn logo
Sep 23 2021 @ 21:14PM

నా కుటుంబంలోని మగాళ్లను ఎవరూ పెళ్లి చేసుకోవద్దు.. రెండు పేజీల లేఖ రాసి మరీ ఓ వివాహిత బలవన్మరణం.. అసలేం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ‘‘నా కుటుంబంలోని మగాళ్లను ఎవరూ పెళ్లి చేసుకోవద్దు’’ అంటూ రెండు పేజీల లేఖ రాసి మరీ ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. పెళ్లై ఏడాది తిరిగేసరికల్లా ఆమె ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె పుట్టింటివారు భారీ షాక్‌కు గురయ్యారు. రాజస్థాన్ రాష్ట్రం బూందీ జిల్లాల్లో ఈ దారుణం జరిగింది. తాలాబ్ జిల్లాకు చెందిన నస్రీమ్‌కు 2020 మార్చిలో సాహిల్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే.. భర్తతో గొడవల కారణంగా ఆమె కొంతకాలం నుంచి పుట్టింట్లోనే నివసిస్తోంది. 

బుధవారం రాత్రి భోజనాల తరువాత తన గదిలోకి వెళ్లి పడుకున్న ఆమె ఓ రాత్రి వేళ ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో..వివాహిత పుట్టింటివారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆ గదిలో మహిళ రాసిన రెండు పేజీల లేఖ కూడా లభ్యమైంది. అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ ఆమె లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. తన అత్తింట్లో మగాళ్లను ఏ ఆడపిల్లా పెళ్లి చేసుకోవద్దని కూడా ఆమె రాసింది. అక్కడ ఉన్నన్నాళ్లూ తాను పడ్డ కష్టాలన్నిటినీ లేఖలో పేర్కొంది. మృతురాలి కుటుంబసభ్యులు ఈ లేఖను పోలీసులకు అందజేశారు. 

అత్తింటి వేధింపులు తట్టుకోలేకే తన కూతురు మరణించిందని నస్రీమ్ తండ్రి ఫరూఖ్ ఆరోపించారు. నస్రీమ్ అత్తమామలు ఆమెను కట్నం కోసం నిత్యం వేధించేవారని, తరచూ చేయిచేసుకునేవారని కూడా ఆయన ఆరోపించారు. దీంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. 

ప్రత్యేకంమరిన్ని...