Abn logo
Jun 3 2021 @ 10:53AM

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ద్వారకా నగర్‌లో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వాడపల్లి ఝాన్సీ(23) అనే మహిళకు కరోనా సోకడంతో ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో ఉంది. ఏమైందో ఏమో కానీ ఝాన్సీ తన భర్త, మామ ఇంట్లో లేని సమయంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సమాచారం అందుకున్న భర్త రాము వెంటనే ఇంటికి చేరుకుని.. 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చాడు. అప్పటికే  ఝాన్సీ మృతి చెందింది. ఆమె మెడపై ఉరి వేసుకున్న గుర్తులున్నాయని 108 సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.


 అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement
Advertisement
Advertisement