Advertisement
Advertisement
Abn logo
Advertisement

పని మీద బటయకు వెళ్లిన భర్త.. ఇంట్లో ఒంటరిగా భార్య.. రాత్రి 11 గంటల ప్రాంతంలో తలుపు తట్టిన అతడి ఫ్రెండ్స్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: కొన్నాళ్ల క్రితం అతడు ఓ అమ్మాయిని చూసి, ఇష్టపడ్డాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నాడు. వారి జీవితం సంతోషంగా సాగిపోతోంది. ఈ క్రమంలోనే అతడు.. భార్యను ఒంటరిగా ఇంట్లోనే వదిలి ఓ పని మీద బంధువుల ఇంటికి వెళ్లాడు. అదే రోజు రాత్రి 11 గంటల తర్వాత.. అనుకోకుండా అతడి స్నేహితులు తన ఇంటికి వెళ్లారు. ఫ్రెండ్ లేడన్న విషయాన్ని గ్రహించారు. ఆమె ఒక్కతే ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని జై‌పూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి.. తాను ఇష్టపడిన అమ్మాయిని అర్ధాంగిగా చేసుకున్నాడు. తాను ఉద్యోగం చేస్తున్న ప్రాంతంలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని, భార్యతో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 15న అతడు తన భార్యను ఇంట్లో ఒంటరిగా వదిలేసి, ఓ పని మీద బంధువుల ఇంటికి వెళ్లాడు. చీకటి పడటంతో అతడు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. విషయం భార్యకు చెప్పి, జాగ్రత్తగా ఉండమంటూ ఫోన్ ద్వారా సూచించాడు. దీంతో భోజనం త్వరగా ముగించుకుని, డోర్లు లాక్ చేసుకుని ఇంట్లోనే ఉండిపోయింది. రాత్రి 11 గంటల తర్వాత తలుపు తట్టిన శబ్దం కావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భయం భయంగానే డోర్ తీసింది. వచ్చిన ఇద్దరు వ్యక్తులు (సురేశ్, రామ్‌స్వరూప్) .. తన భర్త స్నేహితులుగా పరిచయం చేసుకోవడంతో ఆమెలోని ఆందోళన కాస్త తగ్గింది. 


తన భర్త పని మీద బయటకు వెళ్లాడని చెప్పి, అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసింది. అయితే.. ఆ సమయాన్ని సరేశ్, రామ్‌స్వరూప్ అవకాశంగా భావించారు. ఆమెపై అత్యాచారం చేశారు. అంతేకాకుండా ఆ దృశ్యాలను వీడియో తీసి, ఈ విషయం బయటపెడితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం అని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆ బాధను తనలోనే దాచుకున్న ఆ మహిళ.. తాజాగా తన భర్తకు చెప్పేసింది. అంతేకాకుండా భర్త సహాయంతో పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సురేశ్, రామ్‌స్వరూప్‌లను అరెస్టు చేసి, జైలుకు తరలించారు. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement