అభివృద్ధికి దూరంగా మర్రిపాలెం..!

ABN , First Publish Date - 2021-10-24T04:34:04+05:30 IST

కాలంతో పాటు మానవుడు నాగరికత వైపు ఎంత వేగంగా పరిగెత్తినాఆనాదిగా సామాజికంగా, ఆర్థికంగా తీవ్ర వెనుకబాటుకు గురవుతూనే ఉన్నారు. మండలం లోని మర్రిపాలెం గ్రామం అభివృద్ధికి దూరంగా ఉంది.

అభివృద్ధికి దూరంగా మర్రిపాలెం..!
కోతకు గురైన బ్రిడ్జి

అంతులేని చెంచుల వెతలు  

ప్రధాన రహదారి కరువు

రేషన్‌ బియ్యం కోసం 7 కిలోమీటర్లు నడవాల్సిందే

పట్టించుకోని పాలకులు

పెద్ద దోర్నాల, అక్టోబరు 23 : కాలంతో పాటు మానవుడు నాగరికత వైపు ఎంత వేగంగా పరిగెత్తినాఆనాదిగా సామాజికంగా, ఆర్థికంగా తీవ్ర వెనుకబాటుకు గురవుతూనే ఉన్నారు. మండలం లోని మర్రిపాలెం గ్రామం అభివృద్ధికి దూరంగా ఉంది. అక్కడి చెం చుల వెతలు అంతులేనివి. నల్లమల అటవీ ప్రాంతంలోనే నివశి స్తూ అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్‌ కోసం ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఎంతో చేశామని,ఇంకా చేస్తామంటూ గొప్పలు  చెప్పడమే తప్ప  క్షేత్ర స్థాయిలో  అభివృద్ధి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ఏదైనా వారిలో అంతో ఇంతో మార్పు వచ్చిందంటే కాలానుగుణంగా జరిగిన పరిణామమే. ప్రజా స్వామ్యంలో ఇది మా హక్కు, మా అభివృద్ధికి మీరు ఏమి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించే చైతన్యం వారిలో ఇంకా రా లేదు. అందుకే వారి పేరు చెప్పి పాలకులు, అధికారులు సంపన్నులవుతున్నారు. కానీ వారి జీవితాల్లో వెలుగులు నింపే చర్యలు తీ సుకోవడం లేదు. అడవి కాచిన వెన్నెల్లానే నల్లమల చెంచు గిరిజనులు జీవిస్తున్నారు. ప్రధానంగా మండలంలోని మర్రిపాలెం గిరిజన గ్రామంలో సుమారు 750 మంది నివాసముంటున్నారు. తరత రాలుగా కొండలు గుట్టల మధ్య చిల్లకంప నడుమ చాలీ చాలని గుడిసెల్లోనే నివాసముంటున్నారు.  దశాబ్దాల క్రితం మంజూరైన పక్కా గృహాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. విద్య కోసం ప్రత్యేకంగా చేపట్టిన చర్యలు ఫలితాన్ని ఇవ్వలేకపోతు న్నాయి. అధి కారులు, కాంట్రాక్టర్ల జేబులు నింపుకునేందుకు అవసరానికి మించి పాఠశాల కోసమంటూ పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తారు. పిల్లలు ఉండరు. వారి తల్లి దండ్రులలో చైతన్యం నింపి పాఠశాలకు పం పించేందుకు కృషి చేయరు. వైద్యం సంగతి దేవుడెరుగు. గ్రామానికి వెళ్లేందుకు నేటికీ  ప్రధాన రహదారి సక్రమంగా లేదంటే అతిశయోక్తి కాదు. శ్రీశైలం-దోర్నాల ఘాట్‌ రోడ్డు నుంచి 7 కిలో మీటర్ల అభయారణ్యం గుండా ప్రయాణించాల్సి ఉంది. సరైనా దారి లేదు. పెద్ద పెద్ద చెట్లు, ముళ్ల పొదలు, ఎత్తైన వెదురు దారంతా రాళ్లతో కూడి ఉంటుంది. మధ్యలో రాళ్లవాగు కూడా ఉంది. ఈ వాగుపై ఎప్పుడో చిన్న పాటి బ్రిడ్జిని నిర్మించారు. వర్షాలకు అది కాస్తా కొట్టుకుపోయింది. వానలు కురిసాయంటే నీళ్లు ఈ బ్రిడ్జి మీదుగా ప్రవహిస్తాయి. దాంతో గ్రామానికి రాకపోకలు ఉండవు. గ్రామానికి వెళ్లాలంటే తోడుండాల్సిందే. ముళ్ల పొదల మా టున ఎలుగుబంట్లు, రుతలు ఉండే ప్రమాదం లేకపోలేదు. చాలా సార్లు ఎలుగుబంట్లు దాడికి గురైన సంఘ టనలు కూడా ఉన్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి ఉంది. ఇటీవల కురిసిన వర్షానికి రోడ్డుకు అడ్డంగా పెద్ద వృక్షం ఇరిగి ప డింది. ఇప్పటికీ తొలగించిన దాఖలా లు  లేవు. రేషన్‌ బియ్యం కోసం ప్రతి నెలా చింతల వెళ్లాల్సిందే. 7కిలో మీ టర్లు కాలినడకన వెళ్తూ ఇబ్బందులు పడుతున్నామని గ్రామంలోనే డిపో ఏర్పాటు చేయాలని పలు మార్లు గిరి జనులు అధికారుల కో రినా స్పందించడం లే దని తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐటీడీఏ అధికారులు నిత్యం గ్రామాలు సం దర్శిస్తుంటారు. కానీ సమస్యల పరిష్కారానికి చేపట్టిన చర్యలు శూన్యం. అటవీ ఉత్పత్తుల సేకరణతోనే పొట్ట నింపుకుంటున్నా మన్న మాటే కానీ మూడో పూట భోజనం చేసేందుకు తగిన జీవ నోపాధులు కరువయ్యాయి. అప్పుడప్ప డూ కల్పించే ఉపాధి పనులు తప్పించి జీవనోపాధులు మెరుగు పర్చేందుకు చేపట్టిన ప్రత్యేక చర్యలు లేవు. సుధీర్ఘ కాలం పోరాటాల ఫలితంగా పోడు భూములకు పట్టాలు లభించినా, సాగు చేసుకునేందుకు విత్తనాలు, ఎరు వులు, మందు లు,  ఆర్థిక తోడ్పాటు అందించక బీడు భూములుగానే మిగిలిపోయాయి. ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పడిన తర్వాత తమ జీవితాల్లో మార్పులు వస్తాయని  ఆ శించారు. కానీ వీధి దీపాలు ఏర్పాటుకు కూడా నిధు లు మంజూరు కాలేదని ఆ యా గ్రామాల స ర్పంచులు వాపోతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మాతల రాతలు మారలేదని, మా గ్రామానికి ప్రధాన రహదారిని ఏ ర్పాటు చేయాలని చెం చ్ఝులు కోరుతున్నారు.




Updated Date - 2021-10-24T04:34:04+05:30 IST