‘అంగనవాడీ’ మెనూకు మంగళం

ABN , First Publish Date - 2021-12-06T06:16:02+05:30 IST

మండలంలోని పలు అంగనవాడీ కేంద్రాల్లో మెనూకు మంగళం పాడుతున్నారు. గర్భవతులు, బాలింతలు, 3-6 ఏళ్ల లో పు పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉందన్న విమర్శ లున్నాయి.

‘అంగనవాడీ’ మెనూకు మంగళం
రంగు గుర్తులు లేని గుడ్లను సరఫరా చేసిన దృశ్యం

కూరగాయలు, ఆకుకూరలు ఉత్తమాటే..

బ్లాక్‌ మార్కెట్‌కు తరలుతున్న గుడ్లు


యాడికి, డిసెంబరు 5: మండలంలోని పలు అంగనవాడీ కేంద్రాల్లో మెనూకు మంగళం పాడుతున్నారు. గర్భవతులు, బాలింతలు, 3-6 ఏళ్ల లో పు పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉందన్న విమర్శ లున్నాయి. అంగనవాడీల్లో పోషకాలతో కూడిన ఆహారాన్ని మెనూ ప్రకారం అందిస్తామని గొప్పలు పోతున్న ప్రభుత్వం... క్షేత్రస్థాయిలో ఉత్తుత్తిగా మా రింది. ఆకాశాన్నంటుతున్న కూరగాయలు, ఆకు కూరల ధరలతో అంగనవాడీల్లో వీటిని కొనేట్లు లేదు. దీంతో మెనూ అమలు అంతంతమాత్రంగానే కొ నసాగుతోంది. మరోవైపు కేంద్రాలకు సరఫరా చేసే గుడ్ల నాణ్యత బెడిసికొ డుతోంది. గుడ్డు 50 మిల్లీగ్రాములు ఉండాల్సి ఉండగా ఆ మేరకు సరఫరా చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. గుడ్లు బ్లాక్‌ మార్కెట్‌కు తరలకుండా వాటిపై 1-10వ తేదీ వరకు ఒక రంగు, 11-20 వరకు ఒక రంగు, 21- 30 వరకు ఒక రంగు వేయాల్సి ఉంది. కానీ కాంట్రాక్టర్లు రంగులు వేయకుండానే సరఫరా చేస్తుండడంతో గుడ్లు బ్లాక్‌ మార్కెట్‌కు తరలుతున్నాయనే విమర్శలు లేకపోలేదు. దీంతో అంగనవాడీ కేంద్రాల్లో సంపూర్ణ పోషణ అం తంత మాత్రమే కొనసాగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంగనవాడీ కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన సూపర్‌వైజర్లు నామమాత్రంగానే విధులకు హాజరవుతున్నారనే విమర్శలున్నాయి. 


గుడ్లకు రంగు గుర్తులు వేయడం లేదు

హుస్సేనమ్మ, సూపర్‌వైజర్‌, యాడికి సెక్టార్‌

గుడ్లు సరఫరా చేసే ఏజెన్సీ వారు వాటికి రంగుల గుర్తులు వేయడం లే దు. అలాగే ఎక్కడబడితే అక్కడ గుడ్లు అనలోడ్‌ చేసి వెళుతున్నారని మా దృష్టికి వచ్చింది. ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు చేపడతాం. మెనూ అమలుకు చర్యలు తీసుకుంటాం.


Updated Date - 2021-12-06T06:16:02+05:30 IST