Advertisement
Advertisement
Abn logo
Advertisement

చితక్కొట్టిన గప్టిల్‌ను వెనక్కి పంపిన చాహర్

రాంచీ: సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ దూకుడుగా ఆడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆరంభం నుంచే దూకుడు మొదలుపెట్టింది. మరీ ముఖ్యంగా ఓపెనర్ మార్టిన్ గప్టిల్ చెలరేగిపోయాడు. క్రీజులో ఉన్నంతసేపు బౌలర్లకు చుక్కలు చూపించాడు.


భువనేశ్వర్ కుమార్ బౌలింగును చీల్చిచెండాడాడు. ఈ క్రమంలో చాహర్ బౌలింగులో మరో భారీ షాట్‌కు యత్నించిన గప్టిల్.. పంత్‌కు దొరికిపోయాడు. 15 బంతులు ఎదుర్కొన్న గప్టిల్ 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేశాడు.


మరోవైపు, డరిల్ మిచెల్ నిదానంగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతున్నాడు. ప్రస్తుతం ఆరు ఓవర్లు ముగిశాయి. కివీస్ వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. మిచెల్ 21, చాప్‌మన్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

Advertisement
Advertisement