May 18 2021 @ 13:58PM

మరో స్క్రిప్ట్ రెడీ చేస్తున్న మారుతి

దర్శకుడు మారుతి ప్రస్తుతం స్క్రిప్ట్ రెడీ చేస్తూ చాలా బిజీగా ఉన్నారని సమాచారం. రీసెంట్‌గా యాక్షన్ హీరో గోపీచంద్తో  'పక్కా కమర్షియల్' సినిమా మొదలు పెట్టాడు. రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా కొంత టాకీ పార్ట్ పూర్తయ్యాక కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. మళ్ళీ చిత్రీకరణ ప్రారంభం కావడానికి కాస్త సమయం పడుతుండటంతో..ఈ సమయంలో మంచి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఉండే కథను సిద్దం చేస్తున్నాడట. గత చిత్రం 'ప్రతీరోజూ పండగే'తో మంచి హిట్ అందుకున్న మారుతి ఆ ఊపుతోనే గోపీచంద్ కోసం కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా సాగే పక్కా కమర్షియల్ రూపొందిస్తున్నాడు. రాశి ఖన్నా లాయర్ పాత్రలో కనిపించబోతోంది. ఇక 'త్రీ రోజెస్' అనే వెబ్ సిరీస్‌కు కథ అందించాడు.  తెలుగు ఓటీటీ ఆహా కోసం తయారవుతున్న ఇందులో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది.