మహింద్రాకు పోటీ.. వాహన లీజ్ సర్వీసును ప్రారంభించిన మారుతి

ABN , First Publish Date - 2020-07-02T23:23:43+05:30 IST

దేశంలోని అతిపెద్ద ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ గురువారం తన వాహన

మహింద్రాకు పోటీ.. వాహన లీజ్ సర్వీసును ప్రారంభించిన మారుతి

న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ గురువారం తన వాహన లీజింగ్ సర్వీస్ ‘మారుతి సుజుకి సబ్‌స్క్రయిబ్’ను ప్రారంభించినట్టు తెలిపింది. కోవిడ్-19 కారణంగా ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్న నేపథ్యంలో వివిధ మార్గాల్లో వెహికల్ ఓనర్‌షిప్ మోడల్స్‌ను ప్రమోట్ చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా ఓరిక్స్ ఆటో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ లిమిటెడ్‌తో చేతులు కలిపింది. జపాన్‌కు చెందిన ఓరిక్స్ కార్పొరేషన్‌కు ఇది అనుబంధ సంస్థ. ఇది వెహికల్ లీజింగ్ సర్వీసును మార్కెట్లో లాంచ్ చేయనున్నట్టు కంపెనీ తెలిపింది.

 

పైలట్ ప్రాజెక్టులో భాగంగా గురుగ్రామ్, బెంగళూరులలో కార్స్ సబ్‌స్క్రిప్షన్‌ను ప్రారంభించనుంది. తొలుత మారుతి సుజుకీ ఎరీనా చానల్ నుంచి స్విఫ్ట్, డిజైర్, విటారా బ్రెజ్జా, ఎర్టిగా, నెక్సా చానల్ నుంచి బాలెనో, సియాజ్, ఎక్స్ఎల్6లు అందుబాటులో ఉంటాయి. హ్యుందయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, మహింద్రా అండ్ మహింద్రా లిమిటెడ్‌లు ఇప్పటి వెహికల్ లీజ్‌ను ప్రారంభించిన నేపథ్యంలో తాజాగా మారుతీ సుజుకీ కూడా ఈ సేవల్లోకి ప్రవేశించింది.  

Updated Date - 2020-07-02T23:23:43+05:30 IST