భారత్‌కు ఆ సత్తా ఉంది..

ABN , First Publish Date - 2020-11-27T06:43:23+05:30 IST

ప్రభుత్వం, ఇండస్ట్రీ కలిసికట్టుగా కృషి చేయడం ద్వారా చౌక ఉత్పత్తిలో చైనాను సైతం అధిగమించగల సత్తా భారత్‌కు ఉందని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ అన్నారు. అంతేకాదు, భారత పారిశ్రామిక రంగంలో పోటీ పెంచడంపైనా

భారత్‌కు ఆ సత్తా ఉంది..

ఇండస్ట్రీ, ప్రభుత్వం కలిసి పనిచేస్తే  తయారీలో చైనాను అధిగమించగలం

పోటీతత్వం పెంచే పాలసీలు అవసరం  మారుతీ సుజుకీ చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ 


న్యూఢిల్లీ: ప్రభుత్వం, ఇండస్ట్రీ కలిసికట్టుగా కృషి చేయడం ద్వారా చౌక ఉత్పత్తిలో చైనాను సైతం అధిగమించగల సత్తా భారత్‌కు ఉందని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ అన్నారు. అంతేకాదు, భారత పారిశ్రామిక రంగంలో పోటీ పెంచడంపైనా ప్రభుత్వం దృష్టిసారించాలన్నారు. ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఏ) గురువారం నాడు నిర్వహించిన ఆన్‌లైన్‌ సదస్సులో భార్గవ తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 


భారత  కంపెనీల మధ్య పోటీ పెంచడమే ప్రభుత్వ పాలసీల ఏకైక ఉద్దేశమై ఉండాలి.  అప్పుడే మన కంపెనీలు ప్రపంచంలో అత్యుత్తమ నాణ్యతతో కూడిన వస్తువులను కారు చౌకగా తయారు చేయగలవు. 


పరిశ్రమల వ్యాపారం ఎంత ఎక్కువగా పెరిగితే, దేశంలో ఉద్యోగాల కల్పన అంత మెరుగవుతుంది. అన్ని రంగాల్లో ఉద్యోగావకాశాలు పెంచడం ఆర్థిక సమగ్రాభివృద్ధికి ఎంతో కీలకం. 


కొన్ని ప్రభుత్వాలు తమ రాష్ట్రంలోని ప్లాంట్ల ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్‌ కల్పిస్తున్నాయి. ఇది పోటీతత్వానికి వ్యతిరేకం. 


ఎంఎస్‌ఎంఈలు సైతం ప్రపంచస్థాయిలో పోటీపడగలగాలి. కంపెనీల ప్రమోటర్లు, మేనేజ్‌మెంట్‌ తమ కార్మికులనూ భాగస్వాములుగా భావిస్తే తప్ప పోటీతత్వాన్ని పెంచలేం. 


జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ .. దేశీ మార్కెట్లోకి సరికొత్త బీఎండబ్ల్యూ ఎక్స్‌5 ఎం కాంపిటీషన్‌ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ ధర రూ.1.95 కోట్లు. కంప్లీట్లీ బిల్టప్‌ యూనిట్‌ (సీబీయూ)గా ఎక్స్‌5 ఎం దిగుమతి చేసుకున్నట్లు తెలిపింది. వీ 8 పెట్రోల్‌ ఇంజన్‌, 8 స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన ఈ ఎస్‌యూవీ 3.8 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 


ఇటలీ ప్రీమియం స్కూటర్‌ తయారీదారు పియాజియో.. అప్రీలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 స్కూటర్‌ ఉత్పత్తిని త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 


హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఎ్‌సఐ).. స్పెషల్‌ ఎడిషన్‌ యాక్టివా 6జీ విడుదల చేసింది. రెండు వేరియంట్లలో తీసుకువచ్చిన ఈ స్కూటర్‌ ధరలు రూ.66,816, రూ.68,316 (గురుగ్రామ్‌ ఎక్స్‌షోరూమ్‌) గా ఉన్నాయి. 

Updated Date - 2020-11-27T06:43:23+05:30 IST