ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన మేరీకోమ్

ABN , First Publish Date - 2020-03-30T21:35:02+05:30 IST

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఓరకంగా యుద్ధమే జరుగుతోంది. యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా భూతాన్ని ఈ భూగోళం

ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన మేరీకోమ్

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఓరకంగా యుద్ధమే జరుగుతోంది. యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా భూతాన్ని ఈ భూగోళం నుంచే తరిమికొట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఓవైపు.. ఈ వైరస్‌ బారిన పడకుండా లాక్‌డౌన్‌లతో ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు.. ఎక్కడికక్కడ.. ఈ వైరస్‌ను అంతం చేసేందుకు అవసరమైన మందులను తయారుచేసేందుకు లాబొరేటరీల్లో నిరంతరాయంగా పరీక్షలు జరుగుతున్నాయి. 


ఈ నేపథ్యంలో ఈ పోరాటంలో ప్రభుత్వాలకు విరాళాలు అందిస్తూ అండగా నిలుస్తున్నారు. ప్రముఖ బాక్సర్.. ఆరుసార్లు విశ్వవిజేతగా నిలిచిన మేరీకోమ్ కూడా విరాళం ప్రకటించి తన ఉదారతని చాటుకున్నారు. కరోనా మహమ్మారిపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి సహాయంగా తన ఒక నెలజీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ఆమె ప్రకటించారు. 


రాజ్యసభ సభ్యురాలైన మేరీకోమ్ తన స్థానిక సంస్థల అభివృద్ధి నిధుల నుంచి కోటి రూపాయిలను కరోనా వ్యాప్తి నివారణ కోసం ప్రభుత్వానికి అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలువురు క్రీడాకారులు, సెలబ్రిటీలు.. వైరస్‌పై పోరాటానికి సహాయార్థం తమకు తోచిన మొత్తాన్ని విరాళంగా అందించిన విషయం తెలిసిందే. సచిన్ టెండూల్కర్, సురేశ్ రైనా, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రముఖ షట్లర్ పీవీ సింధు.. తదితరులు ప్రభుత్వాలకు విరాళాలు అందించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2020-03-30T21:35:02+05:30 IST