వ్యాయామంలో మాస్క్‌?

ABN , First Publish Date - 2020-06-20T05:30:00+05:30 IST

వుహాన్‌లో ఓ వ్యక్తి ఫేస్‌మాస్క్‌ ధరించి జాగింగ్‌ చేస్తూ, ఛాతీనొప్పితో ఆస్పత్రి పాలైన సంఘటన ఈ మధ్య వెలుగులోకి వచ్చింది. ఫేస్‌మాస్క్‌ ధరించకుండా ఎక్కడకూ వెళ్లలేని ప్రస్తుత పరిస్థితిలో...

వ్యాయామంలో మాస్క్‌?

వుహాన్‌లో ఓ వ్యక్తి ఫేస్‌మాస్క్‌ ధరించి జాగింగ్‌ చేస్తూ, ఛాతీనొప్పితో ఆస్పత్రి పాలైన సంఘటన ఈ మధ్య వెలుగులోకి వచ్చింది. ఫేస్‌మాస్క్‌ ధరించకుండా ఎక్కడకూ వెళ్లలేని ప్రస్తుత పరిస్థితిలో, మాస్క్‌ ధరించి వ్యాయామం చేస్తే ఏమవుతుంది?


ఆరుబయట అవసరం లేదు: ఆరుబయట జాగింగ్‌ లేదా పరుగు లాంటి వ్యాయామాలు చేసే వారు ముఖానికి ఫేస్‌మాస్క్‌ ధరించకపోయినా ప్రమాదం లేదు. అయితే సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలి. జాగింగ్‌ లేదా రన్నింగ్‌ కోసం పార్కులకు వెళ్లినప్పుడు ఇతరులకు కనీసం ఆరడుగుల దూరం పాటించాలి. 

వ్యాయామ సమయంలో మాస్క్‌ ధరిస్తే: వ్యాయామ సమయంలో ఎక్కువగా ఊపిరి పీల్చుకుంటాం. మాస్క్‌ ధరించినప్పుడు ఊపిరి పీల్చేందుకు ఊపిరితిత్తులు ఎక్కువగా శ్రమపడతాయి. దాంతో సరిపడా గాలి అందక, బడలికతో తేలికగా అలసిపోతాం. పైగా వ్యాయామంతో చెమట పట్టి, మాస్క్‌ తడిచిపోయి అసౌకర్యం కలిగిస్తుంది.

వీరు ధరించకపోవడమే మేలు: ఉబ్బసం, గుండె జబ్బులు కలిగినవాళ్లు వ్యాయామ సమయంలో మాస్క్‌ ధరించకపోవడమే మేలు. అలాగే వ్యాయామం చేసేటప్పుడు అలసట కలిగితే, వెంటనే వ్యాయామం ఆపేసి విశ్రాంతి తీసుకోవాలి.


Updated Date - 2020-06-20T05:30:00+05:30 IST