ఎక్కువ సేపు మాస్క్‌తో ఈ వ్యాధి ముప్పు!

ABN , First Publish Date - 2020-05-30T17:49:33+05:30 IST

కరోనా వైరస్ నుండి రక్ష‌ణ‌కు నిరంత‌రం మాస్కులు ధ‌రిస్తున్న‌వారు శ్వాసకోశ, హృదయ సంబంధిత‌ సమస్యలతో బాధపడుతున్నార‌ని వెల్ల‌డ‌య్యింది. మెడికల్ సైన్స్ ప‌రిభాషలో ఈ స‌మ‌స్య‌ల‌తో కూడిన...

ఎక్కువ సేపు మాస్క్‌తో ఈ వ్యాధి ముప్పు!

డెహ్రాడూన్‌: కరోనా వైరస్ నుండి రక్ష‌ణ‌కు నిరంత‌రం మాస్కులు  ధ‌రిస్తున్న‌వారు శ్వాసకోశ, హృదయ సంబంధిత‌ సమస్యలతో బాధపడుతున్నార‌ని వెల్ల‌డ‌య్యింది. మెడికల్ సైన్స్ ప‌రిభాషలో ఈ స‌మ‌స్య‌ల‌తో కూడిన వ్యాధిని హైపర్కాప్నియా అంటారు. ఉత్త‌రాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ కుమార్  మాట్లాడుతూ  మాస్కులు ధరించడం తప్పుకాదని, అయితే చాలా సేపు వాటిని ధ‌రించ‌డం ఆరోగ్యానికి చేటు తెస్తుంద‌ని అన్నారు. మాస్కు ధ‌రించిన‌ వ్య‌క్తి విడుదల చేసిన కార్బన్ డయాక్సైడ్ మళ్ళీ నోరు, ముక్కు ద్వారా ఊపిరితిత్తులకు చేరుకుంటుంద‌ని, ఈ కారణంగా ఇలాంటి సమస్యలు ఎదురువుతున్నాయ‌న్నారు. ఫ‌లితంగా తలనొప్పి, వికారం త‌దిత‌ర స‌మ‌స్య‌లు ఎదుర‌‌వుతున్నాయ‌న్నారు. ముఖ్యంగా క్వారంటైన్ సెంట‌ర్ల‌లో ఉన్న‌వారు మాస్కులు ధ‌రించ‌డం వ‌ల‌న ఇలాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నార‌న్నారు.  అయితే సాధార‌ణ ప్ర‌జ‌లు జనంలోకి వెళ్లిన‌ప్పుడు మాత్ర‌మే మాస్కులు ధ‌రించాల‌ని, ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్‌లను ధ‌రించాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. 

Updated Date - 2020-05-30T17:49:33+05:30 IST