తప్పని సరిగా మాస్కులు ధరించాలి

ABN , First Publish Date - 2021-04-10T05:46:54+05:30 IST

మాస్కులు ధరించడం తప్పని సరి చేస్తూ శుక్రవారం జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ ఎం.రాజేశ్‌చంద్ర టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి ఏకైక ఆయుధం మాస్కులు ధరించడం అన్నారు.

తప్పని సరిగా మాస్కులు ధరించాలి
అవగాహన కల్పిస్తున్న జైనథ్‌ ఎస్సై వెంకన్న

ఆదిలాబాద్‌టౌన్‌, ఏప్రిల్‌ 9: మాస్కులు ధరించడం తప్పని సరి చేస్తూ శుక్రవారం జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ ఎం.రాజేశ్‌చంద్ర టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి ఏకైక ఆయుధం మాస్కులు ధరించడం అన్నారు. జిల్లా అంతటా వారం రోజులుగా  పోలీసు అధికారులు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. పట్టణంలో అన్ని ప్రధాన కూడళ్ల వద్ద మాస్కులు తప్పని సరిగా ధరించి తమకు తాము రక్షించుకోవాలని, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి ప్రజలకు చైతన్య పరుస్తున్నామని పేర్కొన్నారు. కొందరు ఇప్పటికి మాస్కులు ధరించక పోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. పోలీసులు, రెవెన్యూ, ఆరోగ్య శాఖ సంయుక్తంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి మరింత కఠినతరం చేయనున్నట్లు తెలిపారు.  ఇందులో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

గుడిహత్నూర్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని లేకుంటే చర్యలు తప్పవని ఎస్సై ప్రవీన్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని మన్కనపూర్‌, మండల కేంద్రంలో ఎక్స్‌రోడ్‌, బస్టాండ్‌, సంత ఏరి యా ప్రాంతాల్లో కరోనా నిబంధనలపై ఆయన అవ గాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విధిగా మాస్కు ధరించి బయటకు రావాలన్నారు. మాస్కులు ధరించని వారికి జరిమానా తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జైనథ్‌: మండలంలోని ప్రజలు మాస్కులు ధరించక పోతే భారీ జరిమానా విధిస్తామని ఎస్సై సాయిరెడ్డి వెంకన్న హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని లేఖర్‌వాడ గ్రామంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కరోనా అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. చేతులను శానిటైజర్లతో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు. ప్రధాన కూడళ్లలో గుంపులు గుంపులు ఉండరాదన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎస్సై జీవన్‌కుమార్‌, సర్పంచ్‌ చందమమత, ఉప సర్పంచ్‌ బింగివెంకన్న, నాయకులు విఠల్‌, ఆకుల రామారావ్‌లతో పాటు లేఖర్‌వాడ ప్రజలున్నారు.

Updated Date - 2021-04-10T05:46:54+05:30 IST