లెబనాన్‌లో భారీ పేలుడు

ABN , First Publish Date - 2020-08-05T08:03:07+05:30 IST

లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోని ఓడరేవు పరిసరాల్లో రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. రెండు భవనాలూ నేలమట్టమయ్యాయి. ప్రాణనష్టం

లెబనాన్‌లో భారీ పేలుడు

లెబనాన్/ బీరుట్‌: లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోని ఓడరేవు పరిసరాల్లో పావుగంట వ్యవధిలోనే రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. రెండు భవనాలూ పూర్తిగా నేలమట్టమయ్యాయి. 2,700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ ఒక్కసారిగా పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ పేలుడు వల్ల  బీరుట్ పోర్టు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో 78 మంది మృతిచెందగా.. దాదాపు 4 వేల మందికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ పేలుడు ధాటికి అక్కడ భారీగా భవనాలు కుప్పకూలడంతో చాలా మందికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. అత్యవసర నిధి కింద 100 బిలియన్ డాలర్లు విడుదల చేసినట్లు ఆ దేశ అధ్యక్షుడు తెలిపారు.

Updated Date - 2020-08-05T08:03:07+05:30 IST