Abn logo
Sep 19 2021 @ 23:04PM

అన్ని హంగులతో బృహత్‌ ప్రకృతివనం : జడ్పీ సీఈవో

బృహత్‌ ప్రకృతివనాన్ని పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో

నర్సాపూర్‌, సెప్టెంబరు 19 : నర్సాపూర్‌ మండలం పెద్దచింతకుంట సమీపంలో 7 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయనున్న బృహత్‌ ప్రకృతివనం సహజమైన అటవీ ప్రాంతాన్ని తలపించేలా ఉంటుందని జడ్పీ సీఈవో శైలేష్‌ పేర్కొన్నారు. ఆదివారం ఎంపీడీవో మార్టిన్‌, సర్పంచ్‌ శివకుమార్‌, ఏపీవో అంజిరెడ్డి, ఎంపీవో సందీ్‌పతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చదనం పెంచాలనే ఉద్దేశంతో జాతీయ రహదారి పక్కన ప్రత్యేకంగా కేటాయించిన ఈ స్థలంలో అటవీ ప్రాంతంలో పెరిగే చెట్లనే ఇక్కడ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా చెట్లను పెంచడంతో పాటు ఇష్టానుసారంగా కొట్టకుండా కాపాడుకోవాలని సూచించారు. అదేవిధంగా పలు గ్రామాల్లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్‌ క్యాంపులను సందర్శించి వ్యాక్సినేషన్‌ జరుగుతున్న తీరును పరిశీలించారు.