Abn logo
Jun 7 2020 @ 13:41PM

కడప జిల్లాలో ఘోర ప్రమాదం

కడప : జిల్లాలోని దువ్వూరు మండలం చింతకుంటలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా లారీలో మంటలు చెలరేగాయి. లారీలో ఉన్న డ్రైవర్‌, క్లీనర్‌ సజీవదహనం అయ్యారు. ఆళ్లగడ్డ నుంచి మైదుకూరు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Advertisement
Advertisement
Advertisement