భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు

ABN , First Publish Date - 2021-06-22T08:42:44+05:30 IST

నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో సోమవారం ఎండ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రాష్ట్రమంతా పొడి వాతావరణం నెలకొంది. కోస్తాలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కం టే 3-5 డిగ్రీలు అధికంగా

భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు

తునిలో 41 డిగ్రీలు.. నెమ్మదించిన ‘నైరుతి’


అమరావతి, విశాఖపట్నం, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో సోమవారం ఎండ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రాష్ట్రమంతా పొడి వాతావరణం నెలకొంది. కోస్తాలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కం టే 3-5 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. దక్షిణకోస్తా, రాయలసీమలో ఎండ మండిపోయింది. అత్యధికంగా తునిలో 41, బాపట్లలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సీమలో నాలుగైదు చోట్ల చెదురుమదురుగా వాన జల్లులు పడ్డా యి. మంగళవారం రాష్ట్రంలో ఒకటీరెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఉత్తరకోస్తాలో ఒకటీరెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 

Updated Date - 2021-06-22T08:42:44+05:30 IST