బ్రిస్బేన్ టెస్ట్: రెండో రోజు ఆటకు వరుణుడు అడ్డంకి

ABN , First Publish Date - 2021-01-16T16:22:30+05:30 IST

గబ్బా స్టేడియంలో టీమిండియా, ఆసీస్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆట వరుణుడు కారణంగా నిలిచిపోయింది.

బ్రిస్బేన్ టెస్ట్: రెండో రోజు ఆటకు వరుణుడు అడ్డంకి

బిస్బేన్: గబ్బా స్టేడియంలో టీమిండియా, ఆసీస్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆట వరుణుడు కారణంగా నిలిచిపోయింది. అంతకుముందు టీ బ్రేక్ సమయానికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. జట్టు స్కోర్ 11 పరుగుల శుభ్‌మన్ గిల్ అవుటవ్వగా, హాఫ్ సెంచరీ దిశగా వెళుతున్న రోహిత్ శర్మ(44)ను లియన్ అవుట్ చేశాడు. దీంతో 60 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. 


ఇదిలా ఉంటే, జట్టు స్కోర్ 274/5 పరుగుల దగ్గర రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్, 369 పరుగులకు ఆలౌట్ అయింది. మరో 95 పరుగులు జోడించి మిగత ఐదు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో లుబుషేన్ శతకం(108)తో రాణిస్తే.. కెప్టెన్ టిమ్ పైన్ హాఫ్ సెంచరీ(50), కామెరాన్ గ్రీన్(47), మాథ్యూ వేడ్(45) పరుగులతో పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, నటరాజన్, శార్దూల్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ ఒక వికెట్ తీశాడు.    

Updated Date - 2021-01-16T16:22:30+05:30 IST