లాక్‌డౌన్ దెబ్బకు జీతాలు లేక రోడ్డున పడిన మాస్టారు!

ABN , First Publish Date - 2020-09-03T00:51:12+05:30 IST

పుస్తకాలు పట్టుకుని పాఠాలు చెప్పిన మాస్టరు ఇప్పుడు అదే చేతులతో చెప్పులు అమ్ముతున్నాడు. బ్లాక్ బోర్డుపై..

లాక్‌డౌన్ దెబ్బకు జీతాలు లేక రోడ్డున పడిన మాస్టారు!

పుస్తకాలు పట్టుకుని పాఠాలు చెప్పిన మాస్టారు ఇప్పుడు అదే చేతులతో చెప్పులు అమ్ముతున్నాడు. బ్లాక్ బోర్డుపై పాఠాలు చెప్పాల్సిన గురువు.. ప్రస్తుతం రోడ్డుపై చెప్పులు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది. కరోనా కారణంగా ప్రైవేటు పాఠశాలలు మూతపడ్డాయి. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో ప్రైవేటు టీచర్లు చాలా యాజమాన్యాలు జీతాలు ఇవ్వలేదు. దీంతో ప్రైవేటు టీచర్లు రోడ్డున పడ్డారు.


విజయవాడకు చెందిన టి.వెంకటేశ్వరరావు పేరొందిన నాలుగు ప్రైవేటు పాఠశాలల్లో మాక్స్, సోషల్ చెబుతూ ఉండేవారు. పాఠశాలలు మూత పడటంతో జీవితం తలకిందులైంది. భార్య, ఇద్దరు ఆడపిల్లల కుటుంబాన్ని పోషించలేక ప్రత్యామ్నాయం కోసం ఆలోచించాడు. చివరికి ఉపాధి లేక స్నేహితుడిని ఆశ్రయించాడు. తన స్నేహితుడు పాదరక్షల హోల్ సేల్ దుకాణం నడుపుతూ ఉంటాడు. ఆయన తనకు కొన్ని పాదరక్షలు ఇచ్చి విజయవాడలో అమ్ముకుని రావాలని సూచించారు. దీంతో ఆ పాదరక్షలను విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో అమ్మడం ప్రారంభించారు. రెండు నెలల నుంచి ఇలా చెప్పులు తీసుకువచ్చి రోడ్డు మీద అమ్ముకుని రోజుకు రూ.250 తీసుకుని జీవనాన్ని సాగిస్తున్నాడు. 

Updated Date - 2020-09-03T00:51:12+05:30 IST