Abn logo
Dec 1 2020 @ 00:31AM

మత్స్యగిరి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి

వలిగొండ, నవంబరు 30: వలిగొండ, నవంబరు 30: వలిగొండ, నవంబరు 30: సింహస్వామి దివ్యక్షేత్రంలో సోమవారం చక్రతీర్థం, యాగశాలలో మహా పూర్ణాహుతి పూజ లు శాస్త్రోక్తంగా జరిగాయి. దేవతోధ్వాసనం శ్రీ పుష్పయాగ ద్వాదశారాధన, ధ్వజావరోహణం ఆగమ శాస్త్ర రీతిలో రుత్వికులు వైభవంగా నిర్వహించారు. సోమవారంతో శ్రీ మత్స్యగిరి స్వామి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి అయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో నేత్రానందంగా జరిగే పర్వమే చక్రతీర్థ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.  మహోత్సవాల్లో  చక్రతీర్ధ పుణ్యస్నానాలతో సకల పాపాలు తొలగుతాయని  భక్తుల విశ్వాసం. హైందవ బ్రహ్మోత్సవ వంతు ప్రధాన అర్చకులు శ్రీ ప్రతాపురం శ్రీనివాసాచార్యులు  యజ్ఞపర్యవేక్షకులు శ్రీ మద్వాదుల శ్రీమన్నారాయణ పర్యవేక్షణలో జరిగింది. శ్రీ కార్యక్రమంలో ఏవో గుత్తా మనోహర్‌రెడ్డి, రుత్వీకులు అర్చక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహస్వామిని పలువిధ పుష్పాలు తులసిదళాలు సహస్రనామాలతో అర్చించే వేదికే పుష్పయాగం. సత్యనారాయణస్వామి వ్రతాలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు.

Advertisement
Advertisement