మట్కా ఆడుతున్న 14 మంది అరెస్టు

ABN , First Publish Date - 2021-05-08T06:10:03+05:30 IST

మట్కా ఆడుతున్న 14 మంది అరెస్టు

మట్కా ఆడుతున్న 14 మంది అరెస్టు

మహబూబాబాద్‌, మే 7 (ఆంధ్రజ్యోతి) : మహబూబాబాద్‌ పట్టణంలో మట్కా ఆడుతున్న పద్నాలుగు మంది ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.76 వేల నగదు, 12 సెల్‌ఫోన్‌లు, నోట్‌బుక్‌తో పాటు స్లిప్పులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. మహబూబాబాద్‌ తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు ఎస్పీ వివరాలను వెల్లడించారు. మహబూబాబాద్‌లోని బెస్తబజారులో మట్కా ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. బెస్తబజారుకు చెందిన పిల్లి సంధ్య మట్కాను నిర్వహిస్తూ పట్టణంలో కొంతమందిని ఈ జూదానికి ఆలవాటు చేసింది. నెంబర్ల ప్రకారం ఆడిస్తూ డబ్బులు వసూలు చేస్తోందని, మహారాష్ట్రకు చెందిన వ్యక్తికి ఈ ఆటపై కమీషన్‌ పంపుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. మట్కా నిర్వాహకులతో పాటు జూదం ఆడుతున్న పదమూడు మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.76 వేల నగదు, 12 సెల్‌ఫోన్‌లు, బుక్‌తో పాటు స్లిప్పులను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, టౌన్‌ సీఐ జి.వెంకటరత్నం, టాస్క్‌ఫోర్స్‌ ఎస్సై రామారావు, టౌన్‌ ఎస్సై అరుణ్‌కుమార్‌, ఏఎస్పీ యోగేష్‌గౌతమ్‌ను ఎస్పీ కోటిరెడ్డి అభినందించారు.


Updated Date - 2021-05-08T06:10:03+05:30 IST