పెళ్లి పేరుతో యువతి నుంచి రూ.5.85 లక్షలు లూటీ

ABN , First Publish Date - 2021-05-12T17:57:40+05:30 IST

నగరానికి చెందిన యువతికి మ్యాట్రిమెనీ సైట్‌లో పరిచయం పెంచుకున్న సైబర్‌ నేరగాడు ఆమె నుంచి రూ.5.85 లక్షలు కాజేశాడు...

పెళ్లి పేరుతో యువతి నుంచి రూ.5.85 లక్షలు లూటీ

సైబర్‌క్రైం ఠాణాలో ఫిర్యాదు

హైదరాబాద్/హిమాయత్‌నగర్‌: నగరానికి చెందిన యువతికి మ్యాట్రిమెనీ సైట్‌లో పరిచయం పెంచుకున్న సైబర్‌ నేరగాడు ఆమె నుంచి రూ.5.85 లక్షలు కాజేశాడు. పాతబస్తీకి చెందన యువతికి ముస్లిం మ్యాట్రిమెనీ సైట్‌లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. తాము దుబాయ్‌లో స్థిరపడిన భారతీయులంమంటూ మాట కలిపాడు. దుబాయ్‌లో ఉన్న ఆస్తులను అమ్ముకొని త్వరలో నగరానికి వచ్చి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తాను డబ్బుతో ఇండియా వచ్చానని.. ఢిల్లీలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తమ వద్ద ఉన్న విదేశీ కరెన్సీ కారణంగా విచారణ చేస్తున్నారని తెలిపాడు. కస్టమ్స్‌ అధికారులకు చెల్లించేందుకు తనవద్ద ఇండియన్‌ కరెన్సీ లేదని... రూ.5.85 లక్షలు ఇస్తే... వెంటనే నగరానికి వచ్చి తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన యువతి అతడు సూచించిన ఖాతాలోకి రూ.5.85 లక్షలు బదిలీ చేసింది. తర్వాత ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ రావడంతో మోసపోయానని గ్రహించి సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2021-05-12T17:57:40+05:30 IST