Abn logo
Oct 13 2021 @ 01:17AM

చెత్తవాగుడు ఆపండి

ట్రోలింగ్‌పై మ్యాక్స్‌వెల్‌ ఆగ్రహం ఫ క్రిస్టియన్‌కూ తగిలిన సెగ

షార్జా: ఐపీఎల్‌ ఎలిమినేటర్‌లో కోల్‌కతా చేతిలో బెంగళూరు ఓడిన తీరుపై అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. ఆ మ్యాచ్‌లో విఫలమైన బెంగళూరు ఆటగాళ్లు మ్యాక్స్‌వెల్‌, డాన్‌ క్రిస్టియన్‌తో పాటు గర్భవతి అయిన అతడి భాగస్వామి జోర్జియా డున్‌ను సోషల్‌ మీడియాలో నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్‌ చేశారు. దుర్భాషలాడుతూ పెట్టిన కామెంట్లపై మ్యాక్సీ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. చెత్తవాగుడు ఆపాలంటూ ఫైరయ్యాడు.

 ‘ఈ సీజన్‌లో మేం బాగా ఆడినా.. దురదృష్టవ శాత్తూ ఓడిపోయాం. అయితే, సోషల్‌ మీడియాలో చెత్తవాగుడు ఎంతో కలచి వేసింది. మేం కూడా మనుషులమే. ప్రతి మ్యాచ్‌ లోనూ అత్యుత్తమ ప్రదర్శనే చేయాలనే అనుకుంటాం. కొంచెం మర్యాదగా ప్రవర్తించండి’ అని మ్యాక్స్‌వెల్‌ ట్విటర్‌లో ఆవేదనతో పోస్టు చేశాడు. కాగా, తన భాగస్వామిని ఇందులోకి లాగ వద్దని క్రిస్టియన్‌ విజ్ఞప్తి చేశాడు. ‘నా పార్ట్‌నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ కామెంట్ల సెక్షన్‌ చూడండి. నేను సరిగా ఆడలేదు.. ఆమెను వదిలేయండ’ని క్రిస్టియన్‌ దీనంగా వేడుకున్నాడు. 

క్రైమ్ మరిన్ని...