టీకా తీసుకోని వారిపై కఠిన ఆంక్షలు: యూఏఈ

ABN , First Publish Date - 2021-04-22T05:39:10+05:30 IST

యూఏఈలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కొవిడ్ ఉధృతి కొనసాగుతోంది. ఈ క్రమంలో మహమ్మారిని కట్టడి చేయడం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ వేసుకునేందుకు జంకుతున్న

టీకా తీసుకోని వారిపై కఠిన ఆంక్షలు: యూఏఈ

అబుధాబి: యూఏఈలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కొవిడ్ ఉధృతి కొనసాగుతోంది. ఈ క్రమంలో మహమ్మారిని కట్టడి చేయడం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ వేసుకునేందుకు జంకుతున్న వారిని ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. వ్యాక్సిన్ పొందని వారి కదలికలను పరిమితం చేసే విధంగా కఠిన నిబంధనలు తీసుకురానున్నట్టు ప్రకటించింది. ‘ఈ రోజు మీ సంకోచం మా లక్ష్యాలకు అడ్డంకిగా మారుతోంది. ఇది మీరు ఇష్టపడేవారిని, మీ కుటుంబ సభ్యులను మొత్తం ఈ సమాజాన్నే ప్రమాదంలో పడేస్తోంది’ నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అధికార ప్రతినిధి హెచ్చరించారు. అంతేకాకుండా ఇప్పటి వరకు యూఏఈ జనభాలో 65శాతం మంది కొవిడ్ వ్యాక్సిన్‌ను పొందినట్టు తెలిపారు. 


Updated Date - 2021-04-22T05:39:10+05:30 IST