Abn logo
Aug 2 2021 @ 21:13PM

India in England: తొలి టెస్టు నుంచి మయాంక్ అవుట్

లండన్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టును గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు గాయాలబారినపడగా, తాజాగా ఆ జాబితాలోకి ఓపెనర్ మయాంక్ అగర్వాల్ చేరాడు. నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్‌లో నేడు (సోమవారం) నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఓ బంతి మయాంక్ హెల్మెట్‌కు బలంగా తాకింది. దీంతో కంకషన్‌కు గురయ్యాడు. ఫలితంగా తొలి టెస్టు నుంచి అతడిని పక్కనపెట్టారు. 


భారత జట్టు ఇప్పటికే గాయాలతో బాధపడుతోంది. శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, అవేష్ ఖాన్ గాయాల కారణంగా 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు దూరమయ్యారు. దీంతో వారి స్థానాలను భర్తీ చేసేందుకు పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్‌లను పిలుపిస్తున్నారు. వీరిద్దరికీ తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ రావడంతో మంగళవారం (3న) యూకే వెళ్లనున్నారు. అక్కడికి వెళ్లాక పది రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ తప్పనిసరి కావడంతో వీరిద్దరూ మూడో టెస్టు నుంచి అందుబాటులో ఉంటారు.