Advertisement
Advertisement
Abn logo
Advertisement
May 2 2021 @ 22:19PM

మమత, స్టాలిన్, విజయన్‌లకు మాయావతి అభినందనలు

లక్నో: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చీఫ్ మమతా బెనర్జీకి బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి అభినందనలు తెలిపారు. ఆమెతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్‌, అసోం సీఎం శర్వానంద సోనోవాల్‌‌‌లకు సైతం ఆమె శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆమె ఇవాళ ట్విటర్ వేదికగా స్పందిస్తూ... ‘‘పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ సాధించిన విజయానికి గానూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. అలాగే తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాల్లో విజయం సాధించిన స్టాలిన్, విజయన్, సోనోవాల్‌లకు కూడా అభినందనలు..’’ అని పేర్కొన్నారు. 

Advertisement
Advertisement