Abn logo
Sep 19 2021 @ 16:45PM

కూతలే కానీ చేతలు లేవు: బీజేపీపై మాయావతి ఫైర్

లఖ్‌నవూ: తన నాలుగున్నరేళ్ల పాలనపై పాలనలో ఎంతో మార్పు జరిగిందంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓవైపు గొప్పలు చెప్పుకుంటుంటే ‘‘నాలుగున్నరేళ్ల పాలనలో కూతలే కానీ చేతలు లేవు’’ అంటూ బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి విమర్శలు గుప్పించారు. భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రకటనలు, వాదనలు అన్నీ గాలిలో తేలిపోయేవని, వాస్తవ పరిస్థితులకు అవి ఎంతో దూరంలో ఉంటాయని, చేతల్లో అవి ఎక్కడా కనిపించవని ఆదివారం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు.


‘‘దేశంలో పేదరికం అంతకంతకూ పెరుగుతోంది. దీనికి తోడు ద్రవ్యోల్బణం పేద ప్రజలను మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. బీజేపీ పాలనలో జరిగిన అభివృద్ధి ఇదే. ‘నాలుగున్నరేళ్ల మార్పు’ అని బీజేపీ సంబరాలు చేసుకుంటోంది. ఈ నాలుగున్నరేళ్లలో జరిగిన మార్పు యూపీలో పేద ప్రజలు పెరగడం. బీజేపీ చేసే ప్రకటనలు, ఇచ్చే వాగ్దానాలు ఉత్త గాలి మాటలు. ఆచరణలో అవి ఎక్కడా కనిపించవు. వారి మాటల్లో చేతల్లో చాలా తేడా ఉంటుంది. కూతలే కానీ చేతలు బీజేపీకి లేవు’’ అని మాయావతి ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption