Abn logo
Aug 14 2020 @ 11:22AM

ఆరుగురు ఎమ్మెల్యేలకు మాయావతి మళ్లీ హెచ్చరికలు

లక్నో : కాంగ్రెస్ లో విలీనమైన ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలకు బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. బల పరీక్ష సమయంలో కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దని తేల్చి చెప్పారు. ఈ మేరకు బీఎస్పీ అధిష్ఠానం ఓ విప్‌ను జారీ చేసింది. ఒకవేళ దీనిని ధిక్కరిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు. పైలట్ సంక్షోభం ముదురుతున్న సమయం నుంచే మాయావతి ఈ హెచ్చకరిలు చేస్తూనే ఉన్నారు. సీఎం గెహ్లోత్‌కు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నామని, సమయం కోసం వేచి చూస్తున్నామని కూడా హెచ్చరించారు. 

Advertisement
Advertisement
Advertisement