జీవో 198పై కౌన్సిల్‌ సమావేశం పెట్టండి

ABN , First Publish Date - 2021-08-03T06:52:49+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 198పై నగర పాలక సంస్థ కమిషనర్‌ ప్రకటించిన డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌కు స్పందించి ప్రజల నుం చి స్వీకరించిన అభ్యంతరాలపై కౌన్సిల్‌ సమావేశం నిర్వహించాలని టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ ఎన్‌.బాలస్వామి మేయర్‌ రాయన భాగ్యలక్ష్మికి వినతిపత్రం అందజేశారు.

జీవో 198పై కౌన్సిల్‌ సమావేశం పెట్టండి

మేయర్‌ భాగ్యలక్ష్మికి టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ బాలస్వామి వినతిపత్రం

చిట్టినగర్‌, ఆగస్టు 2 : రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 198పై నగర పాలక సంస్థ కమిషనర్‌ ప్రకటించిన డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌కు స్పందించి ప్రజల నుం చి స్వీకరించిన అభ్యంతరాలపై కౌన్సిల్‌ సమావేశం నిర్వహించాలని టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ ఎన్‌.బాలస్వామి మేయర్‌ రాయన భాగ్యలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. సోమవారం మేయర్‌ను ఆమె చాంబర్‌లో టీడీ పీ కార్పొరేటర్లతో కలిసి టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ ఎన్‌.బాలస్వామి కలిశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం - 1955ను అనుసరించి నగర కౌన్సిల్‌ సమావేశం నిర్వహణ చేపట్టాలని కోరారు. ప్రత్యేక కౌన్సిల్‌ అజెండా అంశం 1/426 నెంబర్‌ను సభాధ్యక్ష స్థానంలో ఉండి తయారుచేసిన తీర్మానానికి భిన్నం గా కౌన్సిల్‌ సభ్యులు, టీడీపీ కార్పొరేటర్లు సవరణ తీర్మానం ఇవ్వగా మేయర్‌ స్వీకరించి, ఓటింగ్‌ చేపట్టాలని ఉన్నా నిబంధనలకు విరుద్ధంగా ఓటింగ్‌ స్వీకరించకుండా సభను ముగించారన్నారు. టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ జీవో నెంబర్‌ 198పై టీడీపీ కార్పొరేటర్ల పూర్తి అభిప్రాయాన్ని తెలియజేయడానికి సమయం కేటాయించకుండా కేవలం 3 నిమిషాల సమయమిచ్చి సమావేశ నిర్వహణలో విఫలమయ్యారని బాలస్వా మి తెలిపారు. ఆ విధంగా కౌన్సిల్‌ తీర్మానం చెల్లదని తెలియజేస్తూ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నామని టీడీపీ ఫ్లోర్‌లీడర్‌, కార్పొరేటర్లు తెలిపారు. కార్పొరేషన్‌ ప్రతిష్టకు భంగం కలగకుండా తదుపరి కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహించి, రాజ్యాంగస్ఫూర్తిని కాపాడాలని మేయర్‌ను కోరారు. మేయర్‌కు వినతిపత్రం అందజేసిన వారిలో టీడీపీ, సీపీఎం కార్పొరేటర్‌ ఉన్నారు.

Updated Date - 2021-08-03T06:52:49+05:30 IST