Abn logo
Sep 27 2021 @ 00:26AM

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి మేయర్‌ పర్యవేక్షణ

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పర్యవేక్షిస్తున్న మేయర్‌ హరికుమారి

విశాఖపట్నం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): గులాబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో నగరంలో పరిస్థితిని జీవీఎంసీ మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి ఆదివారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పర్యవేక్షించారు. తుఫాన్‌ కారణంగా గెడ్డలు పొంగే ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా ముందుగానే గుర్తించి అధికారులను అప్రమత్తం చేశారు. హోర్డింగ్‌ల గురించి టౌన్‌ప్లానింగ్‌ అధికారులను, చెట్లు కూలిపోయే అవకాశంపై ఉద్యానవనం విభాగం అధికారులను అప్రమత్తంచేశారు.