నగరాభివృద్ధికి బాటలు వేస్తున్నాం

ABN , First Publish Date - 2020-12-04T05:29:40+05:30 IST

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నగరాభివృద్ధికి బాటలు వేస్తున్నామని మేయర్‌ వై సునీల్‌రావు తెలిపారు.

నగరాభివృద్ధికి బాటలు వేస్తున్నాం
ఓపెన్‌ జిమ్‌లో పరికరాలను పరిశీలిస్తున్న మేయర్‌ సునీల్‌రావు, కమిషనర్‌ క్రాంతి

మేయర్‌ వై సునీల్‌రావు

కరీంనగర్ టౌన్‌, డిసెంబరు 3: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నగరాభివృద్ధికి బాటలు వేస్తున్నామని మేయర్‌ వై సునీల్‌రావు తెలిపారు. గురువారం నగరంలోని 39వ డివిజన్‌ విద్యానగర్‌లో కమిషనర్‌ వల్లూరు క్రాంతితో కలిసి రూ.4లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. అలాగే అంబేద్కర్‌ స్టేడియంలో ఓపెన్‌ జిమ్‌ను పరిశీలించారు.ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ నగరాన్ని రాష్ట్రంలో రెండో నగరంగా మారుస్తామని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కొండపల్లి సరిత సతీశ్‌, గందె మాధవి, తోట రాములు, దిండిగాల మహేశ్‌, గుగ్గిళ్ల జయశ్రీ పాల్గొన్నారు.


 మెరుగైన ర్యాంకు కోసం సహకరించండి..

కేంద్రం నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్‌-2021 పోటీల్లో కరీంనగర్‌ నగరపాలక సంస్థ మెరుగైన ర్యాంకును సాధించేందుకు మెడికల్‌ అసోసియేషన్‌, హాస్పిటల్‌ సిబ్బంది సహకరించాలని మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, కమిషనర్‌ వల్లూరి క్రాంతి కోరారు. గురువారం ఐఎంఏ సమావేశమందిరంలో మెడికల్‌ అసోసియేషన్‌ సిబ్బందితో ఏర్పాటుచేసిన సమావేశంలో మేయర్‌ మాట్లాడుతూ గత సంవత్సరం 74వ ర్యాంకును సాధించామని, ఈసారి మరింత మెరుగైన ర్యాంకును సాధించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ వసంతరావు, ప్రధాన కార్యదర్శి రామ్‌కిరణ్‌, కోశాధికారి ఎలగందుల శ్రీనివాస్‌, డిఎంహెచ్‌వో డాక్టర్‌ సుజాత పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T05:29:40+05:30 IST