మీ మాటల్లో నిజం ఉంటే మంత్రి సవాల్‌ను స్వీకరించాలి

ABN , First Publish Date - 2020-10-21T05:59:17+05:30 IST

మీలో దమ్ము, ధైర్యం, మీరు చెప్పేమాటల్లో నిజం ఉంటే రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీష్‌రావు చేసిన సవాల్‌ను స్వీకరించాలని కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు బండి సంజయ్‌కుమార్‌ను నగర మేయర్‌ యాదగిరి

మీ మాటల్లో నిజం ఉంటే మంత్రి సవాల్‌ను స్వీకరించాలి

లేకుంటే పదవులకు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి 

ఎంపీ సంజయ్‌కుమార్‌కు మేయర్‌ వై.సునీల్‌రావు ఓపెన్‌ ఛాలెంజ్‌ 


కరీంనగర్‌ టౌన్‌, అక్టోబర్‌ 20: మీలో దమ్ము, ధైర్యం, మీరు చెప్పేమాటల్లో నిజం ఉంటే రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీష్‌రావు చేసిన సవాల్‌ను స్వీకరించాలని కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు బండి సంజయ్‌కుమార్‌ను నగర మేయర్‌ యాదగిరి సునీల్‌రావు డిమాండ్‌ చేశారు. లేకుంటే పదవులకు రాజీనామా చేసి తప్పు ఒప్పుకొని ప్రజల కు క్షమాపణ చెప్పాలని అన్నారు. రెండింటిలో దేనికి ఒప్పుకుంటావో తేల్చుకోవాలంటూ బండి సంజయ్‌ కుమార్‌కు టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లతో కలిసి మేయర్‌ సునీల్‌రావు ఓపెన్‌ ఛాలెంజ్‌ చేశారు. మంగళవారం ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి హరీష్‌రావు దుబ్బాక పాత బస్టాండ్‌ వద్ద బహిరంగ చర్చకు రావాలని సవా ల్‌చేసి మీ కోసం ఎదిరిచూస్తున్నారని, నిజాయితీ, నీ మాటల్లో వాస్తవముంటే తేదీ చెప్పి దుబ్బాకు వెళ్లి ఆసరా పెన్షన్లలో 1600 కేంద్రం వాటా ఉందని నిరూ పించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ అంటేనే భారత్‌ కా జూటా పార్టీగా మారిందని, అబద్దాలు చెప్పే పార్టీ, అవాస్తవాలను ప్రచారం చేసే పార్టీ, సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టింగ్‌లు, ఫేస్‌బుక్‌లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు.


ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ కూడా అబద్దాల కోరని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇస్తున్న 2వేల రూపాయల ఆసరా పింఛన్లలో కేంద్ర ప్రభుత్వం 1800 ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 200 మా త్రమే ఇస్తుందంటూ అవాస్తవాలతో తప్పుడు ప్రచా రం చేసి ప్రజలను మభ్యపెట్టి పార్లమెంట్‌ సభ్యుడి గా గెలిచావని ఆరోపించారు.  దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 11,724 కోట్ల రూపాయలను ఖర్చుచేసి  38,40,000 మందికి వృద్ధులు, వికలాంగు లు, వితంతువులు, నేత, గీత కార్మికులు, ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్లు ఇస్తున్నారని, ఇందులో కేవలం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద 210 కోట్ల 96 లక్షలు మాత్రమేనని, దీనిపై ఏమి సమా ఽధానం చెబుతారని బీజేపీ నాయకులను ప్రశ్నిం చారు. దేశంలోని 16,17 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా నేత, బీడీ కార్మికులు, ఒంటరి మహి ళలకు ఆసరా పెన్షన్లు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. రెండు వేల రూపాయల కేసీఆర్‌ కిట్‌ ఇస్తుంటే అందులో కేంద్రం వాటా ఎనమిది వేలంటూ చెప్పడం వారి అబద్ధాలకు నిదర్శనమని మండిప డ్డారు.


కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున ఆసరా పెన్షన్లకు కేంద్రం నుంచి 6,7 వేల కోట్ల రూ పాయలను తేవాలని, అక్కడ మాట్లాడే చేతగాదని అన్నారు. కరీంనగర్‌ ఎంపీగా అభివృద్ధి కోసం ఒక్క రూపాయ తీసుకురాలేదని, తేస్తే బహిరంగ చర్చకు రావాలని గతంలో సవాల్‌ విసిరినా స్పందన లేదని, ఆయనతో అభివృద్ధి జరుగదని ప్రజలకు తెలిసిపో యిందని అన్నారు. విలేకరుల సమావేశంలో కార్పొరే టర్లు గుగ్గిళ్ల జయశ్రీ, గందె మాధవి మహేశ్‌, తులా శ్రీదేవిచ్రందమౌళి, వాల రమణారావు, చాడగొండ బుచ్చిరెడ్డి, అర్షమల్లేశం, కుర్ర తిరుపతి పాల్గొన్నారు.

Updated Date - 2020-10-21T05:59:17+05:30 IST