మూడునెలల్లో స్మార్ట్‌సిటీ పనులు పూర్తి

ABN , First Publish Date - 2020-10-30T11:05:23+05:30 IST

నగరంలోని వివిధ ప్రాంతాల్లో స్మార్ట్‌ సిటీ నిధులతో చేపడుతున్న రోడ్లు, డ్రెయినేజీలు, ఫుట్‌పాత్‌ నిర్మాణాలు, మిగిలిన పనులన్నిటినీ మూడు నెలల్లో పూర్తయ్యేలా చూస్తామని నగర మేయర్‌ యాదగిరి ..

మూడునెలల్లో స్మార్ట్‌సిటీ పనులు పూర్తి

మేయర్‌ యాదగిరి సునీల్‌రావు


కరీంనగర్‌ టౌన్‌, అక్టోబరు 29: నగరంలోని వివిధ ప్రాంతాల్లో స్మార్ట్‌ సిటీ నిధులతో చేపడుతున్న రోడ్లు, డ్రెయినేజీలు, ఫుట్‌పాత్‌ నిర్మాణాలు, మిగిలిన పనులన్నిటినీ మూడు నెలల్లో పూర్తయ్యేలా చూస్తామని నగర మేయర్‌ యాదగిరి సునీల్‌రావు అన్నారు. గురువారం ఆయన 12, 34,35,54 డివిజన్లలో చేపడుతున్న స్మార్ట్‌సిటీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొవిడ్‌-19, వర్షాల కారణంగా స్మార్ట్‌ పనుల్లో కొంత జాప్యం జరిగినమాట వాస్తవమేనని, ఇప్పుడిప్పుడే పనుల్లో వేగం పెరిగిందని అన్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించి విస్తరించేందుకు జాప్యం జరుగుతోందని తెలుసుకొని ఆయనే స్వయంగా టౌన్‌ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌, స్మార్ట్‌సిటీకాంట్రాక్టు ప్రతినిధులతో కలిసి రోడ్లను కొలిచారు. ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించి రోడ్డు విస్తరణకు సహకరించాలని కోరారు. రోడ్లు, డ్రెయినేజీ, ఫుట్‌పాత్‌ల నిర్మాణపనుల్లో నాణ్యతాప్రమాణాలను పాటించా లని, మరింత వేగం పెంచి గడువులోగా పనులు పూర్తయ్యేలా చూడాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.


 టవర్‌సర్కిల్‌లో పనులను వేగం పెంచాలని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. కార్యక్ర మంలో కార్పొరేటర్లు తోట రాములు, చాడగొండ బుచ్చిరెడ్డి, షకీరా అంజూమ్‌ బర్కత్‌ అలీ, ఇఫ్రాన్‌ తహరీన్‌, వంగల శ్రీదేవిపవన్‌, ఈఈ రామన్‌, టీపీవోలు శ్రీహరి, రాజు, ఆర్వీ కన్సల్‌టెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-30T11:05:23+05:30 IST