కండరాలు పట్టేస్తుంటే..!

ABN , First Publish Date - 2022-01-23T07:05:12+05:30 IST

ఉన్నట్టుండి కండరం పట్టేస్తే బాధతో విలవిల్లాడిపోతారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చని అంటున్నారు నిపుణులు. ....

కండరాలు పట్టేస్తుంటే..!

ఉన్నట్టుండి కండరం పట్టేస్తే బాధతో విలవిల్లాడిపోతారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చని అంటున్నారు నిపుణులు. 

 అధిక వ్యాయామం, ఒకే భంగిమలో ఎక్కువ సమయం కూర్చోవడం, డీ హైడ్రేషన్‌ వంటివి కారణం కావచ్చు.

 క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం వంటి లవణాలు తగ్గడం కూడా కారణమే. 

 కొన్ని సందర్భాల్లో వెన్ను నరంపై ఒత్తిడి పడటం, కిడ్నీ ఫెయిల్యూర్‌, హైపోథైరాయిడిజం, కొన్ని రకాల మందులు వంటివి కూడా కారణం కావచ్చు.

 ముందుగా కారణం తెలుసుకోవాలి. కండరం పట్టేసినప్పుడు ఆ ప్రాంతంలో మర్ధన చేయాలి. కాఫీ, చాక్లెట్స్‌ వంటివి తగ్గించాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. ఆరెంజ్‌, ఆపిల్‌, బొప్పాయి వంటివి ఎక్కువ తినాలి. ఆకుకూరలు తినాలి.  

 ఇతర సమస్యలకు వేసుకుంటున్న మందులు కారణం కావచ్చు. కాబట్టి డాక్టర్‌ సలహా తీసుకోవాలి.

Updated Date - 2022-01-23T07:05:12+05:30 IST