Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎంత ధైర్యం.. నన్నే ఇంటిని శుభ్రం చేయమంటావా? నా స్థాయి ఏంటో తెలుసా..? అంటూ భర్తపై కేసు పెట్టబోయిన MBA భార్య!

ఇంటర్నెట్ డెస్క్: ‘‘ అతడికి ఎంత ధైర్యం.. నన్నే ఇల్లు ఊడవమంటాడా.. అసలు నా స్థాయి ఏంటో అతడికి తెలుసా..? ఎంబీయే చదివిన నన్ను ఇలాంటి పనులను చేయమంటాడా.. అంటూ రెచ్చిపోతున్న ఓ ఇల్లాలిని చూసి పోలీసులు నోరెళ్లెబెట్టారు. భర్త ఇల్లు శుభ్రం చేయమన్నందుకు అతడిపై కేసు పెట్టేందుకు సిద్ధమైన ఆమెను చూసి.. వారికి ఏం చేయాలో పాలు పోలేదు. ఆమేమో తెగ ఇంగ్లీషు దంచేస్తూ... మొగుడు, అత్తగారిపై శివంగిలా ఎగిరిపడుతోంది. వారిపై తక్షణం కేసు పెట్టాలంటూ డిమాండ్ చేస్తోంది..! దీంతో.. పోలీసులే తెల్లమొహం వేశారు. ఇటీవల గుజరాత్‌లో చోటుచేసుకున్న ఘటన ఇది. 

సాధారణంగా చదువుకున్న మహిళలు.. అత్తింట్లో వేధింపులు ఎదురవుతున్నాయనో లేదా కట్నం కోసం అత్తింటివారు పీడిస్తున్నారనో పోలీస్ స్టేషన్ గడపతొక్కుతారు. కానీ.. ఈ ఉన్నత విద్యావంతురాలు తన ఫిర్యాదుతో పోలీసులకే దిమ్మతిరిగిపోయేలా చేసింది. వారు అంతవరకూ ఇటువంటి దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేదు. దీంతో.. తరువాత ఏం చేయాలో అర్థంకాక తెల్లమొహం పెట్టారు. 

ఆమెను శాంతపరిచేందుకు కొందరు అధికారులు తమ వంతు ప్రయత్నం చేశారు. భర్త చిన్న పని చెబితే అందులో తప్పేంటి అంటూ సమస్యలో మరోకోణాన్ని విడమరిచి చెప్పేందుకు ట్రై చేశారు. అంతే.. మళ్లీ ఆమె ఇంతెత్తున లేచింది. ‘‘నేను పెద్ద ఉద్యోగంలో ఉన్నా. ఆఫీసులో నా అజమాయిషీలో బోలెడంత మంది పనిచేస్తుంటారు. అంతటిస్థాయి ఉన్న నన్ను ఇల్లు శుభ్రం చేయమంటాడా..’’ అంటూ ఇంగ్లీషులో దడదడలాడించేసిందా మహిళ! దీంతో.. వారు సైలెంటైపోయారు. ‘‘ఇటువంటి ఫిర్యాదులతో కూడా పోలీస్ స్టేషన్‌కు వచ్చేవాళ్లున్నారా.. అసలు ఏ సెక్షన్ కింద ఫిర్యాదు తీసుకోవాలి..’’ అంటూ పోలీసులే ముక్కున వేలేసుకున్నారు

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement