Advertisement
Advertisement
Abn logo
Advertisement

అది గర్ల్స్ హాస్టల్.. రూమ్ నంబర్-2.. ‘సునీతా.. తలుపు తియ్’ అని ఎన్నిసార్లు పిలిచినా సమాధానం రాలేదు.. ఏం జరిగిందో తెలిస్తే..

రాజస్థాన్‌లోని బర్మేర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకెండ్ ఇయర్ విద్యార్థిని గర్ల్స్ హాస్టల్ రూమ్ నంబర్-2లో ఆత్మహత్య చేసుకుంది. గదిలో ఒక సూసైడ్ నోట్ కూడా లభ్యమయ్యింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని వారు మృతురాలి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మెడికల్ కాలేజీ గర్ల్స్ హాస్టల్‌లో ఉంటున్న సునీత అనే విద్యార్థిని సోమవారం కాలేజీ పూర్తయ్యాక తిరిగి హాస్టల్‌లోని తన రూమ్ నంబర్-2కు చేరుకుంది. అయితే సాయంత్రం టీ తాగేందుకు క్యాంటీన్‌కు రాలేదు. దీంతో గర్ల్స్ హాస్టల్ స్టాఫ్.. రూమ్ నంబర్-2 దగ్గరకు వచ్చి.. ‘సునీతా తలుపు తియ్’ అంటూ ఆమెను పిలిచారు. ఎంతకీ లోపలి నుంచి సమాధానం రాకపోవడంతో కిటికీలో నుంచి లోనికి తొంగిచూసి షాకయ్యారు. లోపల సునీత ఫ్యానుకు ఉరివేసుకుని వేలాడుతుండటాన్ని వారు గమనించారు.

వెంటనే వారు ఈ విషయాన్ని మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ కే ఆసెరీకి తెలిపారు. అలాగే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం సునీత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. సునీత రూమ్‌లో పోలీసులకు ఒక సూసైడ్ నోట్ లభ్యమయ్యింది. అయితే పోలీసులు ఆ సూసైడ్ నోట్‌లో ఏమున్నదీ ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. అయితే ఈ నోట్‌ను సునీత తన తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ రాసిందని తెలుస్తోంది. ‘అమ్మా నాన్నా నన్ను క్షమించండి.. నేను మీ నమ్మకాన్ని వమ్ము చేశాను. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.. నేను ఈ అడుగు వేసినందుకు నన్ను క్షమించండి’ అని దానిలో రాసివున్నట్లు సమాచారం. పోలీసు అధికారి పర్బత్‌సింగ్ తెలిపిన వివరాల ప్రకారం సునీత తాను చదువుకుంటున్న మెడికల్ కాలేజీకి గర్ల్స్ హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు సునీతకు 19 ఏళ్లు. ఆమె రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. హాస్టల్ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం సునీత నవంబరు 24న తన ఇంటికి వెళ్లి తిరిగి డిసెంబరు 3న హాస్టల్‌కు వచ్చింది. తన రూమ్‌లో సునీత ఒంటరిగా ఉండేది. ఈ నేపధ్యంలో కాలేజీ యాజమాన్యం గతంలో ఆమెకు కౌన్సెలింగ్ కూడా ఇప్పించింది.  

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement