గిరిజన భూములను లాక్కోవడం అప్రజాస్వామికం

ABN , First Publish Date - 2021-07-30T05:01:52+05:30 IST

గిరిజన భూములను లాక్కోవడం అప్రజాస్వామికం

గిరిజన భూములను లాక్కోవడం అప్రజాస్వామికం
గార్లలో మెగా పార్కుకు కేటాయించిన స్థలం వద్ద మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్‌

 కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్‌ 

గార్ల, జూలై 29 : మెగాపార్కుల నిర్మాణం కోసం గిరిజన భూములను లాక్కొవడం అప్రజాస్వామికమని కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్‌ ఆరోపించా రు. గార్ల మండలం పోచారం గ్రామంలో గురువారం మెగాపార్కు ఏర్పాటు కోసం కేటాయించిన భూములను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బలరాంనాయక్‌ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ జీవ నం కొనసాగిస్తున్న ఆదివాసీ గిరిజనుల భూముల్లో హ ఠాత్తుగా మెగాపార్కును ఏర్పాటు చేస్తున్నామని చెప్పి వారి భూములను గుంజుకోవడం సిగ్గుచేటన్నారు. 40 ఏళ్ల క్రితమే ఈ భూములు సాగు చేసుకుంటున్న రైతుల కు పట్టాలను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. రైతుల భూముల్లో మెగాపార్కు పనులను నిలి పివేసి మరోచోట మెగాపార్కు కోసం ప్రభుత్వ స్థలం కే టాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయాన్ని కలె క్టర్‌ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు బలరాంనాయక్‌ తెలి పా రు. కాంగ్రెస్‌ నాయకులు చీమల వెంకటేశ్వర్లు, ధనియా కుల రామారావు, మేకల వీరన్న, గట్టన్నగౌడ్‌, వెంకటే శ్వర్లు, పులి సైదులు, కారం భాస్కర్‌, సామ్రాజ్‌, వస్య, భీమ, విఠల్‌, కత్తి వెంకటేశ్వర్లు, చిరంజీవి పాల్గొన్నారు. 

9న ఇంద్రవెళ్లిలో దళిత,గిరిజన దండోరా

మహబూబాబాద్‌ టౌన్‌: టీఆర్‌ఎస్‌ పాలనలో అన్ని వ ర్గాలకు అన్యాయం జరుగుతుందని కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్‌ విమర్శించారు. కొట్లాడి సాధించు కున్న తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం,  పోడు రైతులకు న్యాయం చేయడంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. మహబూబా బాద్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీని ముఖ్యమంత్రి నెరవేర్చ లేదని దుయ్య బట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్లాది రూపా యలు దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి న చరిత్ర సీఎం కేసీఆర్‌దేనని ఎద్దేవా చేశారు. పెట్రోలు, డీజిల్‌ ధరలు తారస్థాయికి చేరుకుని సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతుంటే కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు మిన్న కుండి పోయాయయని మండిపడ్డారు. దళిత, గిరిజన హక్కుల సాధన కోసం ఆగస్టు 9న ఇంద్రవల్లిలో దళిత, గిరిజన దండోరాను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాబోయే కాలం లో కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావ డం ఖాయమని స్పష్టం చేశారు. సమావేశంలో నాయ కులు గుగులోతు వెంకట్‌, హెచ్‌.వెంకటేశ్వర్లు, మేకల వీరన్న, పెరుమాండ్ల గుట్టయ్య పాల్గొన్నారు.

 

Updated Date - 2021-07-30T05:01:52+05:30 IST