పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-06-16T05:18:26+05:30 IST

పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి

పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి
మన్నెగూడెం ఐసోలేషన్‌ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్‌ , ఎస్పీ

 కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ 

మహబూబాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి) : పట్టణాలు, గ్రామాల పురోభివృద్ధికి అధికారులు పునరంకితం కావాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజ యవంతం చేసేందుకు సంబంధిత అధికారులతో మంగళవారం సమగ్రం గా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ మాట్లాడుతూ.. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేశామన్నారు. చెత్త సేకరణకు గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్లు, ట్రాలీతో పాటుగా సెగ్రిగేష న్‌ షేడ్స్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి సంవత్సరం హరితహారంలో మొక్కలు నాటుతూనే ఉంటామని, 10 శాతం ఖర్చు చేస్తూ నాటిన ప్రతి మొక్క బతికేలా చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుధ్యానికి అత్యంత ప్రా ధాన్యత ఇవ్వాలని తెలిపారు. హరితహారం ఏర్పాటు, నర్సరీల నిర్వాహణ, పారిశుధ్యం మెరుగు, సెగ్రిగేషన్‌షేడ్స్‌ వినియోగం, శ్మశానవాటికల ఉప యోగం, ఇంటి పన్నుల వసూలుపై ర్యాంకింగ్‌ తీయడం జరుగుతుందని, తద్వారా పనితీరు తెలుస్తుందన్నారు. మహబూబాబాద్‌ మునిసిపాలిటీలోని వార్డుల పనితీరు మెరుగు పరిచేందుకు మూడు లేక నాలుగు వార్డులకు ఒక ప్రత్యేకాధికారిని నియమిస్తామన్నారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో కౌన్సిలర్లు, మునిసిపల్‌ అధికారులు ప్రగతికి కృషి చేయాలన్నారు. రిజిస్టర్ల నిర్వాహణ సక్రమంగా ఉండాలని, లేని పక్షంలో చర్యలుంటాయన్నారు. పట్టణాలతో సమానంగా గ్రామాలు అభివృద్ది చేసుకునేందుకు పల్లె ప్రగతి ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామ స్ధాయిల్లో లేఅవుట్‌ లేకుండా భూములను ప్లాట్లుగా చేయనీయవద్దని సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ పథ కంపై అవగాహన కల్పించి నిధులను సేకరించుకోవాల న్నారు. పట్టణాలు, గ్రామాల్లో వినియోగించని బోరు బా వులను పూడ్పించాలన్నారు. అదనపు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, జిల్లా అధికారులు అప్పారావు, సన్యాసయ్య, రఘువరన్‌, మునిసిపల్‌ కమిషనర్‌ టి.నరేందర్‌రెడ్డి, నారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కఠిన చర్యలు తీసుకోవాలి..

డోర్నకల్‌: కొవిడ్‌ నియంత్రణకు పోలీస్‌, రెవెన్యు, పంచాయతీరాజ్‌ అధికారులు సమన్వయంతో వ్యవహరించి కట్టడి చేయాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అన్నారు. మంగళవారం కలెక్టర్‌, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డితో కలిసి డోర్నకల్‌,  తోడేళ్లగూడెం, మన్నెగూడెంలలో పర్యటించారు. ఈ సందర్భంగా కరోనా నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. తోడేళ్లగూడెం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో ఏర్పాటుచేసిన  ఐసోలేషన్‌ కేంద్రాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడారు. గ్రామంలోకి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని రాకుండా చూడాలని తోడేళ్లగూడెం సర్పంచ్‌ పగడాల అంజయ్యకు సూచించారు. గ్రామశివారులలో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం మన్నెగూడెం రైతు వేదికలో ఏర్పాటుచేసిన ఐసోలేషన్‌ కేంద్రాన్ని సందర్శించారు.  ఏఎస్పీ యోగేష్‌ గౌతమ్‌, జిల్లా వైద్యాధికారి హరీష్‌రాజ్‌, డాక్టర్‌ విరాజిత, తహసీల్దార్‌ వివేక్‌, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, మండల ప్రత్యేకాధికారి ఖుర్షిద్‌ ఉన్నారు. 

 

Updated Date - 2021-06-16T05:18:26+05:30 IST