Abn logo
Sep 23 2021 @ 23:59PM

వైద్యశాలలను పరిశుభ్రంగా ఉంచాలి

కోమట్లగూడెం పీహెచ్‌సీలో రికార్డులు పరిశీలిస్తున్న కలెక్టర్‌ శశాంక

కలెక్టర్‌ శశాంక 

గంగారం, సెప్టెంబరు 23 : ఏజెన్సీ ప్రాంతాల్లోని వైద్యశాలలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్‌ శశాంక వైద్యాధికారులను ఆదేశించారు. గంగారం మండలంలో గురువారం తొలిసారిగా కలెక్టర్‌ పర్యటించారు. గం గారం, కోమట్లగూడెం ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. వైద్యులు అం దుబాటులో ఉంటున్నారా.. లేదా అని రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్యశాల ఆవరణం అపరిశుభ్రంగా ఉండడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం కోమట్లగూడెం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. వైద్య సిబ్బంది, ఏ ఎన్‌ఎంలు, ఆశావర్కర్లు గ్రామాల్లోని ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్‌ తీసుకునే విధంగా ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. అనంతరం తిరుమలగండిలో నూటికి నూరు శాతం వ్యాక్సిన్‌ పూర్తిచేసిన వైద్య సిబ్బందిని అభినందించారు. ఏఎన్‌ఎం నాగలక్ష్మిని శాలువాతో సత్కరించారు. కోమట్లగూడెం పీహెచ్‌సీలో రికార్డులను పరిశీలించి 24 గంటల పాటు ప్రజలకు వైద్య సేవలందించాలని వైద్యాధికారి ముక్రాంను ఆదేశించారు. గ్రామంలోని పాఠశాలలను సందర్శించి విద్యార్థుల ప్రశ్నలు వేసి వారి సామార్థ్యాలను తెలుసుకున్నారు. అనంతరం గ్రామ ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బస్సు సౌకర్యంతో పాటు ఇం టర్నేట్‌ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉప సం చాలకులుదిలీ్‌పకుమార్‌,జడ్పీటీసీ ఈసం రమ, ఎంపీపీ సూవర్ణపాక సరోజన, వైస్‌ ఎంపీపీ ముడిగ వీరభద్ర, సర్పంచ్‌ దుర్గంసుగుణ, కోమ ట్లగూడెం వైద్యాధికారి హరీ్‌షరాజ్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో అంబరీష, తహసీల్దార్‌ సూర్యనారాయణ, ఎంపీడీవో శ్యాంసుందర్‌ పాల్గొన్నారు.