Abn logo
Sep 25 2021 @ 00:12AM

అటవీశాఖ అనుమతులు తప్పనిసరిగా పొందాలి

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శశాంక

 కలెక్టర్‌ శశాంక

మహబూబాబాద్‌, సెప్టెంబరు 24 (ఆం ధ్రజ్యోతి) : అటవీశాఖ పరిధిలో చేపట్టే పనులను తప్పనిసరిగా అనుమతులు పొందాలని కలెక్టర్‌ శశాంక అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం అటవీ అనుమతులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతాలుగా గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాలు నమోదయ్యాయన్నారు. ఆయా మండలా ల్లో చేపట్టే పనులకు అటవీశాఖ అనుమతులు తప్పనిసరి అని చెప్పారు. గార్ల, బయ్యా రం, నెల్లికుదురు మండలాల్లో కూడా చేపట్టే పనులకు అటవీశాఖ అధికారుల సహాకారం తీసుకోవాలన్నారు.సమావేశంలో అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్‌, కొముర య్య డీఎఫ్‌వో రవికిరణ్‌ పాల్గొన్నారు. అలాగే హరితహారంలో మొక్కలు నాటేందు కు ముందస్తు ప్రణాళికలు అవసరమని కలెక్టర్‌ శశాంక అన్నారు.  కలెక్టరేట్‌లో అటవీశాఖ అధికారుల ఆధ్వర్యంలో హరితహారంపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ హరితహారంలో నాటిన మొక్కల పెంపకానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, డీఎ్‌ఫ వో రవికిరణ్‌, జడ్పీ సీఈవో రమాదేవి, డీఆర్‌డీఏ పీడీ సన్యాసయ్య, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ దశరధం, డీపీవో రఘువరణ్‌, నారాయణరెడ్డి పాల్గొన్నారు.

ప్రకృతి వనాలు పల్లె ప్రజలకు ఆహ్లాదాన్ని పంచాలి

మరిపెడ రూరల్‌(చిన్నగూడూరు) : ఊరూరా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు స్థానిక ప్రజలకు అహ్లాదాన్ని పంచేలా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ శశాంక అధికారులను ఆదేశించారు. శుక్రవారం మరిపెడ మండలంలోని పీఎస్‌ గూడెం, బుర్హన్‌పురం పల్లె ప్రగతి పనులు, అక్కడి పకృతి వనాలను అదనపు కలెక్టర్‌ అభిలాష అభివన్‌తో కలిసి కలెక్టర్‌ శశాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన అధికారులతో మాట్లాడా రు. పల్లెపకృతి వనాల చుట్టు పెన్షింగ్‌ ఏర్పాటు చేసి పిల్లలు, వృద్ధుల కోసం బెంచీలను ఏర్పాటు చేయాలని సూచించారు. పీఎస్‌గూడెం పల్లెపకృతి వనం అబ్బుర పడేలా ఉం దని ప్రశంసించారు. బుర్హన్‌పురంలోని బృహత్‌ పల్లె పకృతి వనం చుట్టు ట్రెంచ్‌ కొట్టిం చి, గుట్టపై ట్యాంక్‌ పెట్టాలని అధికారులను ఆదేశించారు. పనులు సత్వరం పూర్తి చేయాలన్నారు. ఎంపీపీ గుగులోత్‌ అరుణరాంబాబు, జిల్లాఉద్యానశాఖ అధికారి సూర్య నారాయణ, తహసీల్దార్‌ గట్ల రమేశ్‌బాబు, ఎంపీడీవో సింగారపు కుమార్‌, ఏపీవో మం గమ్మ, ఎంపీవో పూర్ణచందర్‌రెడ్డి, జేపీఎస్‌ లెనిన్‌, నరేశ్‌, శ్రీలత తదితరులు ఉన్నారు.