అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పటిక స్వాధీనం

ABN , First Publish Date - 2021-04-18T06:07:53+05:30 IST

అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పటిక స్వాధీనం

అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పటిక స్వాధీనం
అక్రమంగా తరలిస్తున్న బెల్లం, లారీ, నిందితులను చూపుతున్న సీఐ

ఐదుగురు ముఠా సభ్యుల అరెస్ట్‌

మానుకోట టౌన్‌ సీఐ వెంకటరత్నం వెల్లడి

మహబూబాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 17 : మహబూబాబాద్‌ పట్టణ శివారు ఆర్తిగార్డెన్‌ సమీపంలో  అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పటి క లారీని స్వాధీనం చేసుకుని అందుకు బాధ్యులైన ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్‌ చేసినట్లు టౌన్‌ సీఐ జూపల్లి వెంకటరత్నం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చిత్తూరు జిల్లా నుంచి మహబూబాబాద్‌ జిల్లా కేంద్రానికి లారీలో అక్రమంగా తరలిస్తున్న 222 బస్తాల నల్లబెల్లం, రెండు బస్తాల పటికను శనివారం ఉద యం ఆర్తీ గార్డెన్‌ సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. చిత్తూరులో తక్కువ ధరకు వాటిని కొనుగోలు చేసి మహబూబాబాద్‌ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎక్కువ ధరకు విక్రయించేందుకు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. వాటి విలువ సుమారు రూ.3.74 లక్షలు ఉంటుందన్నారు. అక్రమంగా బెల్లం తరలిస్తున్న మహబూబాబాద్‌ కంకర మిల్లు తండాకు చెందిన వాంకుడోతు వీరన్న, ఓర్సు మల్లేష్‌, ఏటిగడ్డ తండాకు చెందిన వాంకుడోతు సుధాకర్‌, గిరిప్రసాద్‌నగర్‌కు చెందిన నాగరబోయిన  మధు, డ్రైవర్‌ ఆకుల మహావీర్‌లను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. పూరితండాకు చెందిన భూక్య వీరేందర్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు. బెల్లం లారీని పట్టుకున్న టౌన్‌ ఎస్సై మురళీధర్‌రాజు, సిబ్బంది వెంకన్న, బాలరాజు, విజయ్‌కుమార్‌, సోమ్లా, వీరన్నలను సీఐ వెంకటరత్నం అభినందించారు.


Updated Date - 2021-04-18T06:07:53+05:30 IST