వాహనంలోనే ప్రసవం

ABN , First Publish Date - 2021-06-12T05:41:15+05:30 IST

వాహనంలోనే ప్రసవం

వాహనంలోనే ప్రసవం
వాహనంలో ప్రసవించిన వలస కూలీ వాణిదేవి

ఓ బిహార్‌ వలస కూలీ ప్రసవ  వేదన

దంతాలపల్లి, తొర్రూరు ప్రభుత్వాస్పత్రికి వెళితే వైద్యులు, సిబ్బంది లేని దుస్థితి 

మార్గమధ్యలో అవస్థలు.. సోషల్‌ మీడియాలో వైరల్‌..

చిన్నగూడూరు, జూన్‌ 11: ఓ వలస కూలీ.. వాహనంలోనే ప్రసవించింది. పురిటినొప్పులతో సమీప ఆస్ప త్రులకు వెళ్లినా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో ఆ గర్భిణి తల్లడిల్లింది.. వరంగల్‌కు తీసుకెళుతుండగా, బొ లెరో వాహనంలోనే బిడ్డకు జన్మనిచ్చింది. మహబూబాబాద్‌ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకున్న ఈ సంఘటన జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనం గా నిలిచింది. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. బాధితులు, జయ్యారం టూబీహెచ్‌ కాం ట్రాక్టర్‌ వల్లూరి చెన్నారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. 

బిహార్‌ రాష్ట్రం ధాన్‌ఘర్‌ జిల్లాకు చెందిన కొందరు కార్మికులు జయ్యారంలో నిర్మిస్తున్న డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణ పనుల్లో కూలీ చేసుకోవడానికి వలస వ చ్చారు. వర్షాకాలం కావడంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. దీంతో కూలీకోసం వలస వచ్చిన వారి లోకొందరు బిహార్‌ రాష్ర్టానికి తిరిగి వెళ్లడానికి రైలు టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. శుక్రవారం చిన్నగూడూరు మండలం జయ్యారం నుంచి ఓ బొలెరో వాహనం కిరాయికి మాట్లాడుకొని కాజీపేటకు రైలు ఎక్కేందుకు ప్రయాణమయ్యారు. 

ఈ క్రమంలో గర్భిణి అయిన వలస కూలీ వాణిదేవికి నర్సింహులపేట స్టేజీకి చేరుకోగానే పురుటినొప్పు లు మొదలయ్యాయి. దీంతో ఆమెను బంఽధువులు తొలుత దంతాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే అక్కడ డాక్టర్లు, వైద్య సిబ్బంది ఎవరూ లేరు. దీంతో తొర్రూరు సీహెచ్‌సీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ కూడా వైద్యులు, సిబ్బంది ఎవరూ లేరు. ఆపై వెంటనే అదే వాహనంలో వరంగల్‌కు వెళుతుండగా, మార్గమధ్యలో రోడ్డుపైనే బొలెరో వాహనంలో ఆమె ప్రసవించింది. ఈ విషయం తెలిసి టూ బీహెచ్‌ కాంట్రాక్టర్‌ తల్లి, బిడ్డను వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స జరిపించారు. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలిపారు.  

Updated Date - 2021-06-12T05:41:15+05:30 IST