రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

ABN , First Publish Date - 2021-04-18T06:11:04+05:30 IST

రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న డీఆర్‌డీఏ పీడీ, ప్రజాప్రతినిధులు

డీఆర్‌డీఏ పీడీ సన్యాసయ్య

పెద్దవంగర, ఏప్రిల్‌ 17: రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని, క్రయ విక్రయాల్లో రైతులకు ఎలాం టి ఇబ్బందులు లేకుండా చూడాలని డీఆర్‌డీఏ పీడీ సన్యాసయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంతో పాటు కొరిపెల్లి, పోచంపల్లి గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ ఈదురు రాజేశ్వరి, జడ్పీటీసీ శ్రీరాం జ్యోతిర్మయి సుధీర్‌లతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన ధ్యానానికి మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధ్యానం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. అలాగే మండలంలోని గంట్లకుంట గ్రామంలో ఉపాధిహామీ కూలీలతో చేపడుతున్న ఫార్మేషన్‌ రోడ్డు పనులను సర్పంచ్‌ భాస్కర్‌రావుతో పలిసి పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ యోగేశ్వర్‌రావు, ఎంపీడీవో శేషాద్రి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సుజాత, డీఆర్‌డీఏ ఏపీడీ వెంకట్‌, సర్పంచ్‌లు లక్ష్మీ, శోభ, యాదలక్ష్మీ,పాలకుర్తి దేవస్థాన చైర్మన్‌ రామచంద్రయ్యశర్మ, ఎంపీటీసీ ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, ఎంపీటీసీలు సబిత, అనురాధ, విజయ, ఎంపీవో యాకయ్య, ఏపీఎం వీరయ్య, ఉపసర్పంచ్‌ రాము, నాయకులు శ్రీరాం సంజయ్‌, లింగమూర్తి, జగధీష్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-18T06:11:04+05:30 IST