పామాయిల్‌ పరిశ్రమ కోసం స్థల పరిశీలన

ABN , First Publish Date - 2021-08-03T05:18:56+05:30 IST

పామాయిల్‌ పరిశ్రమ కోసం స్థల పరిశీలన

పామాయిల్‌ పరిశ్రమ కోసం స్థల పరిశీలన
పామాయిల్‌ పరిశ్రమ స్థలాన్ని పరిశీలిస్తున్న రామకృష్ణారెడ్డి

తొర్రూరు రూరల్‌, ఆగస్టు 2 : తొర్రూరు మండలం గోపాలగిరి గ్రామంలో 70 ఎకరాల్లో ఏర్పాటు చేస్తే పామాయిల్‌ పరిశ్రమ స్థలాన్ని, హరిపిరాల గ్రామంలో ఏర్పాటు చేసే నర్సరీని సోమవారం ఆయిల్‌ ఫెడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న ఐదు పరిశ్రమల్లో ఒకటి గోపాలగిరి గ్రామంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో హరి పిరాల కోటిలింగాల ఆలయం సమీపంలో ఏర్పాటు చేసే పామాయిల్‌ నర్సరీకి లక్ష మొక్కలు రానున్నాయని తెలిపారు. ఆయిల్‌ పామ్‌ సాగుపై ఈనెల 6వ తేదీన రైతు బందు సమితి ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కలిపిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఆయిల్‌ఫెడ్‌ ఏరియా ఆఫీసర్‌ సురేష్‌, ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, రైతుబంధు మండల కోఆర్డినేటర్‌ అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, సంపత్‌, హరికృష్ణ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-08-03T05:18:56+05:30 IST