అంతర్‌ జిల్లా గంజాయి ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2021-06-20T05:55:55+05:30 IST

అంతర్‌ జిల్లా గంజాయి ముఠా అరెస్టు

అంతర్‌ జిల్లా గంజాయి ముఠా అరెస్టు
పట్టుబడిన అంబర్‌, గుట్కా, సిగరెట్‌ ప్యాకెట్లను చూపిస్తున్న ఎస్పీ కోటిరెడ్డి

మహబూబాబాద్‌ రూరల్‌, జూన్‌ 19: అంతర్‌ జిల్లా గంజాయి ఐదుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసి రూ. 5.40 లక్షల విలువైన ఎండు గంజాయి ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ నం ద్యాల కోటిరెడ్డి తెలిపారు. మహబూబా బాద్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో శనివారం కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు. జిల్లాలోని గూడూ రు మండలం ఏపూరు గ్రామానికి చెం దిన బానోత్‌ సురేష్‌, బానోత్‌ సక్రం, గాజులగట్టు గ్రామానికి చెందిన కొర్ల సూర్య, సీతానాగారం గ్రామం భూక్య దస్రుతండాకు చెందిన భానోత్‌ సురేష్‌, భూక్య సుమన్‌లు ముఠాగా ఏర్పడ్డారు.  కొంతకాలంగా భద్రాచలం సరిహద్దు ప్రాంతంలో ఎండు గంజాయి సేకరిం చి నర్సింహులపేట, తొర్రూరు, వరంగ ల్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో యువకుల కు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 19న ఉదయం 8 గంటలకు నర్సింహులపేట మండలం వంతడుపుల స్టేజీ వద్ద ఎస్సై నరేష్‌ కుమార్‌ వాహనాల తనిఖీలు చేస్తుండ గా ఒకరు ద్విచక్రవాహనంపై వస్తూ అతడి వెనుకాలే నలుగురు వ్యక్తులతో పాటు 54కేజీల ఎండు గంజాయి (27 ప్యాకెట్లు) ఉన్నట్టు తెలిపారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని ఇందు కు ఉపయోగించిన ఆటో, ద్విచక్రవాహా న్ని సీజ్‌ చేసినట్లు చెప్పారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తర లించినట్లు ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించా రు. నేరస్తులను చాకచక్యంగా పట్టుకు న్న ఎస్సైలు నరేష్‌కుమార్‌, మురళీధర్‌ రాజు, తొర్రూరు సీఐ కరుణాకర్‌,  డీఎస్పీ వెంకటరమణలను ఎస్పీ అభి నందించి రివార్డులను అందించారు.

అంబర్‌, గుట్కాల పట్టివేత..

మహబూబాబాద్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.4లక్షల విలువైన అంబర్‌, గుట్కా, సిగిరేట్‌లను పట్టుకు ని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. ఈ సం దర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. మహబూబాబాద్‌ నెహ్రూసెంటర్‌లోని అయ్యప్ప కిరాణం షాపులో అక్రమం గా అంబర్‌, గుట్కా, సిగరేట్‌లు ఉన్నా యని పక్కా సమాచారంతో దాడులు నిర్వహించినట్లు చెప్పారు. ఈ దాడు ల్లో 350 అంబర్‌ ప్యాకెట్లు, 3320 జేకే గుట్కా ప్యాకెట్లు, 1600 తోబాకో ప్యాకె ట్లు, 10,860 వీ-1 తోబాకో ప్యాకెట్లు, 4950 ఎన్‌పీ 0-1 ప్యాకెట్లు, 380 విజ యదుర్గ తోబాకో, 27 బాబాబ్లాక్‌ ప్యాకె ట్లు, 1200 వీనస్‌ ఫిల్టర్‌ ప్రిమియం తోబాకో ప్యాకెట్లు, 2220 ప్యారీస్‌ సీగ రేట్‌ పీసులు పట్టుబడినట్లు చెప్పారు. షాపు యాజమాని లెంకలపల్లి శ్రీనివా స్‌ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్ల డించారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరె డ్డి మాట్లాడుతూ... ప్రభుత్వ నిషేదిత అంబర్‌, గుట్కా, సిగిరేట్లతో పాటు అసాంఘీక కార్యకలాపాలకు ఎవరైన పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చ రించారు. నేరస్తులను చాకచక్యంగా పట్టుకున్న మహబూబాబాద్‌ టౌన్‌ సీఐ జూపల్లి వెంకటరత్నం, ఎస్సై వెం కన్న, సిబ్బంది వెంకటరమణ, బాలరా జు, రాజు, రమేష్‌, స్వప్న, ఉదయ్‌, జావేద్‌లతో పాటు గైడ్‌ చేసిన ఏఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ను అభినందించారు.

 

Updated Date - 2021-06-20T05:55:55+05:30 IST