వీవోఏ భర్త నిర్బంధం

ABN , First Publish Date - 2021-06-18T05:40:38+05:30 IST

వీవోఏ భర్త నిర్బంధం

వీవోఏ భర్త నిర్బంధం
వీవోఏ భర్తను జీపీ భవన్‌లో నిర్బంధించి ఆందోళన చేస్తున్న మహిళలు

ఉల్లెపల్లి గ్రామైక్య సంఘం రుణాల మాయంపై మహిళల ఆగ్రహం

పోలీసుల జోక్యంతో సద్దుమనిగిన వివాదం 

మరిపెడ రూరల్‌ (చిన్నగూడూరు), జూన్‌ 17 : బ్యాంక్‌ లింకేజీ రుణం మాయంపై మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం ఉల్లెపల్లి డ్వాక్రా సంఘాల మహిళలు గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన డబ్బులను కాజేశాడని ఉల్లెపల్లిలోని గ్రామైక్య సంఘం మహిళలు వీవోఏ గోరంట్ల రాణి భర్త విష్ణు (ఐలిమల్లు)ను, విచారణకు వచ్చిన సీసీ రుక్మిణిని పంచాయతీ భవన్‌లో నిర్బంధించి తాళం వేశారు. తాము కష్టపడి కూడబెట్టుకున్న డబ్బులను కాజేశాడని ఆగ్రహంతో శాపనార్థాలు పెట్టారు. డబ్బులు ఇచ్చే వరకు వదిలేది లేదని జీపీ భవన్‌ ఎదుట బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకొని మహిళలతో మాట్లాడారు.  విష్ణును చట్టపరంగా శిక్షించి డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో  మహిళలు శాంతించారు. వీవోఏ భర్త విష్ణును పోలీసులు అదు పులోకి తీసుకొని మరిపెడ పీఎస్‌కు తరలించారు. గ్రామానికి చెందిన 38 డ్వాక్రా గ్రూపుల్లో 21 రికార్డులను పరిశీలించగా రూ.22 లక్షలకు పైగా లింకే జీ రుణం మాయమైనట్లు తేలింది. పలు సంఘాల పొదుపు, లోన్‌ కిస్తీల డబ్బులను వీవోఏ భర్తకు ఇవ్వగా వాటిలో నుంచి రూ.3 లక్షలకు పైగా నగ దు మాయమైనట్లు గుర్తించారు. విష్ణుకు సహకరించిన బ్యాంక్‌, ఐకేపీ అధి కారులపై చర్య తీసుకోవాలని మహిళలు డిమాండ్‌ చేశారు. విచారణలో  సీసీ రుక్మిణి, సర్పంచ్‌ సీహెచ్‌.ప్రభాకర్‌, గ్రామస్థులు, డ్వాక్రా సంఘాల బాఽ ద్యులు ఉన్నారు. కొవిడ్‌ విజృంభణ దృష్ట్యా మహిళ సంఘాల బాధ్యులు మాత్రమే హాజరై విచారణకు సహకరించాలని పోలీసులు కోరారు. గుంపులు గుంపులుగా ఉండొద్దని విచారణను తాత్కాలికంగా వాయిదా వేశారు. 


Updated Date - 2021-06-18T05:40:38+05:30 IST