తుది దశలో జ్వర సర్వే

ABN , First Publish Date - 2022-01-28T05:38:21+05:30 IST

తుది దశలో జ్వర సర్వే

తుది దశలో జ్వర సర్వే
మానుకోటలో ఫీవర్‌ సర్వేలో అవసరం ఉన్నవారికి వ్యాక్సిన్‌ వేస్తున్న వైద్య సిబ్బంది, పర్యవేక్షిస్తున్న అర్బన్‌ నోడల్‌ అధికారి చాపల రంజిత్‌రెడ్డి

వారంలో 2.11 లక్షల  గృహాల పరిశీలన

జిల్లాలో 5,292 మందికి ఉచితంగా కిట్ల పంపిణీ

ఇప్పటికే 7 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ముగిసిన కార్యక్రమం

మిగిలిన పీహెచ్‌సీల పరిధిలో నేడో.. రేపో ముగింపు


మహబూబాబాద్‌, జనవరి 27 (ఆంధ్ర జ్యోతి) : జ్వర సర్వే తుది దశకు చేరుకొంది.. కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడోవేవ్‌లో చేపట్టిన ఫీవర్‌ సర్వే చివరి అంకానికి వచ్చింది. మహబూబా బాద్‌ జిల్లాలో ఈనెల 21వ తేదీ నుంచి వైద్య, ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్‌, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఇంటింటికి జ్వర సర్వే నిర్వహి స్తున్నాయి. జిల్లాలో 16 మండలాల్లోని 21 ఆస్పత్రుల పరిధి లో గురువారం వరకు 2,11, 682 గృహాలను పరిశీలించారు. ఇందులో లక్ష ణాలున్న 5, 292 మందికి మందుల కిట్లను పంపిణీ చేశారు. ఈ సర్వేను వైద్య, ఆరోగ్యశాఖ తోపాటు పంచాయతీరాజ్‌, అంగన్‌వాడీ, మెప్మా, రెవెన్యూ సిబ్బంది, అధికారులు సమన్వ యం తో వ్యవహరిస్తూ.. ముమ్మరంగా కొనసాగి స్తు న్నారు. జిల్లాలోని 21 ఆస్పత్రుల్లో ఏడు ఆస్ప త్రుల్లో ఈనెల 26 నాటికే సర్వే పూర్తికాగా, మరో 14 ఆస్పత్రుల పరిధిలో సర్వే కొనసాగు తోంది. అయితే ఒకటి, రెండు రోజుల్లో సర్వే పూర్తి చేయనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. 


జిల్లాలో 5,292 కిట్ల పంపిణీ..

మహబూబాబాద్‌ జిల్లా వ్యాప్తంగా నాలుగు మునిసిపాలిటీలు, 16 మండలాల్లోని 461 గ్రా మపంచాయతీల పరిధిలో తండాలు, ఆవాస ప్రాంతాల్లో 736 బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయి. ఒక్కో బృందంలో మునిసిపాలిటీల్లో అయితే రిసోర్స్‌ పర్సన్‌, మెప్మా సిబ్బంది, ఆశ కార్యకర్త, గ్రామాల్లో అయితే పంచాయతీ కార్య దర్శి, అంగన్‌వాడీ కార్యకర్త, వీఆర్‌ఏ, ఉన్నారు. ఈ సర్వే బృందం ఈనెల 21 నుంచి 27వ తేదీ వరకు వరకు 2,11,682 గృహాలను పరిశీలించగా వీటిలో గురువారం ఒక్కరోజే 12, 222 ఇళ్లలో సర్వే చేశారు. ఇక గురువారం 255 మందిని లక్షణా లున్నట్లుగా గుర్తించగా, ఇప్పటి వరకు 5,292 మందిని గుర్తించారు. జ్వర లక్షణాలున్న వారందరికీ మెడికల్‌ కిట్లను సర్వే బృందం అప్పటికప్పుడే పంపిణీ చేశారు. ఈ బృందాలపై నిత్యం ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోల పర్యవేక్షణ ఉంటోంది. ఆపై ఈ యంత్రాంగాన్ని అంతటినీ కలెక్టర్‌ శశాంక, అదనపు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ హరీష్‌రాజ్‌, ఉప వైద్యాధికారులు అంబరీష, మురళీధర్‌ పర్యవేక్షిస్తున్నారు.


ఫీవర్‌ సర్వేతో కొవిడ్‌ కట్టడి.. : బానోత్‌ నవీన్‌, పెద్దరామోజీ తండా 

జిల్లాలో ఇంటింటి ఫీవర్‌ సర్వేతో మూడోదశలో కరోనాతో ప్రాణనష్టం లేకుండా కట్టడి చేశారు. గ్రామాలు, తండాలు, పట్టణాల్లో వైద్య, జీపీ, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు ఇంటింటికి వెళ్లి జ్వరసర్వే నిర్వహించి జలుబు, దగ్గు, జ్వరం ఉంటే వెంటనే మెడికల్‌ కిట్‌లను అందజేయడంతో వారు బయటకు రాకుండా ఇండ్లలోనే ఉండడంతో వైరస్‌ వ్యాప్తి తగ్గిందని చెప్పవచ్చు. 


మెడికల్‌కిట్ల పంపిణీ బాగుంది.. : గజగోని వీరన్న, కేసముద్రం విలేజి 

గ్రామాల్లో ఇంటింటికీ ప్రభుత్వం చేపట్టిన జ్వరసర్వే బాగుంది. గత రెండువేవ్‌లలో జ్వరంవస్తే ఆస్పత్రికి వెళ్లి మందులు తీసుకునేవాళ్లం. ఈసారి ఇంటి వద్దకే వైద్య సిబ్బంది వచ్చి పరీక్షలు నిర్వహించి, మందులు ఇస్తున్నారు. ఈ సర్వే ద్వారా కరోనా వ్యాప్తిని నివారిస్తూ కొవిడ్‌ బారిన పడిన వారిని గుర్తించడం, వారికి మందులతో నయం చేయడం జరుగుతోంది.

Updated Date - 2022-01-28T05:38:21+05:30 IST