‘వెదురు బ్యాట్‌’ రూల్స్‌కు విరుద్ధం: ఎంసీసీ

ABN , First Publish Date - 2021-05-12T10:44:54+05:30 IST

వెదురుతో క్రికెట్‌ బ్యాట్‌ ఐడియాను మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) తిరస్కరించింది. ఈ ఆలోచన క్రికెట్‌ నియమాలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది. లా సబ్‌ కమిటీ సమావేశంలో

‘వెదురు బ్యాట్‌’ రూల్స్‌కు విరుద్ధం: ఎంసీసీ

లండన్‌: వెదురుతో క్రికెట్‌ బ్యాట్‌ ఐడియాను మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) తిరస్కరించింది. ఈ ఆలోచన క్రికెట్‌ నియమాలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది. లా సబ్‌ కమిటీ సమావేశంలో ఈ అంశంపై కూలంకషంగా చర్చిస్తామని పేర్కొంది. వెదురుతో బ్యాట్‌ను తయారు చేయడం వల్ల ఖర్చుతోపాటు ఎంతో మన్నికగా ఉంటాయని  కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ ఇటీవల ఓ అధ్యయనంలో పేర్కొంది. ‘ప్రస్తుత రూల్స్‌ ప్రకారం బ్యాట్‌ను ఒకే చెక్కతో తయారు చేయాలి. వెదురు బ్యాట్‌ను ప్రత్యామ్నాయంగా పరిగణించాలంటే నిబంధనలు మార్చాలి’ అని ఎంసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. విల్లో చెక్కకు ప్రత్యామ్నాయాలను కూడా చర్చిస్తామని తెలిపింది.  

Updated Date - 2021-05-12T10:44:54+05:30 IST